CM Jagan on PRC: పీఆర్సీపై జగన్ కీలక భేటీ.. ఉద్యోగుల డిమాండ్లు నెరవేరేనా?

CM Jagan on PRC: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల పీఆర్సీపై తేల్చడం లేదు. ఫలితంగా ఏళ్లుగా ఆ హామీ నానుతూనే ఉంది. ఉద్యోగుల ఆశలు మాత్రం తీరడం లేదు. ఫలితంగా ఉద్యోగుల్లో నిరాశ పెరుగుతోంది. దీర్ఘకాలం తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే క్రమంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుండటంతో వారిలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఉద్యోగులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఉద్యోగులు […]

Written By: Srinivas, Updated On : December 28, 2021 11:02 am
Follow us on

CM Jagan on PRC: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల పీఆర్సీపై తేల్చడం లేదు. ఫలితంగా ఏళ్లుగా ఆ హామీ నానుతూనే ఉంది. ఉద్యోగుల ఆశలు మాత్రం తీరడం లేదు. ఫలితంగా ఉద్యోగుల్లో నిరాశ పెరుగుతోంది. దీర్ఘకాలం తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే క్రమంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుండటంతో వారిలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఉద్యోగులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

CM Jagan on PRC

ఉద్యోగులు ఎన్నోమార్లు అల్టీమేటం జారీ చేసినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో ఉద్యోగుల డిమాండ్లు నెరవేరే దారి కనిపించడం లేదు. ఈ క్రమంలో ఉద్యోగుల కోరికలు తీరే మార్గం మాత్రం కనిపించడం లేదని తెలుస్తోంది. సీఎం జగన్ నేడు ఉద్యోగుల డిమాండ్లపై చర్చించేందుకు సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో వారి డిమాండ్లు తీరుస్తారో లేదో అనే అనుమానాలు వస్తున్నాయి.

Also Read: సినిమా టిక్కెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా?

జనవరి 3 వరకు ఉద్యోగుల డిమాండ్లు తీర్చే పీఆర్సీ ప్రకటించకపోతే మరోమారు ఉద్యమం చేస్తామని చెబుతుండటంతో జగన్ ఏ మేరకు స్పందిస్తారో అని అందరిలో సందేహాలు వస్తున్నాయి. రాష్ర్ట ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఉద్యోగులకు భారీ నజరానాలు మాత్రం ఉండవనేది స్పష్టమవుతోంది. దీంతో ఉద్యోగులు ఎలా స్పందిస్తారో తెలియడం లేదు. ప్రభుత్వ విధులు నిర్వహించే ఉద్యోగులకు ప్రభుత్వం మాత్రం సరైన విధంగా న్యాయం చేయడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఉద్యోగ సంఘాలు మాత్రం మా డిమాండ్లు నెరవేర్చకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏ మేరకు వారి కోరికలు తీర్చేందుకు ప్రాధాన్యం ఇస్తుందోనని చూస్తున్నారు. దీంతో మంగళవారం నాటి సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఉద్యోగుల ఆశలు తీరుతాయో లేదా ఉద్యమం చేయాల్సి వస్తుందోనని అందరు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందోననే ప్రశ్నలు వస్తున్నాయి.

Also Read: అయ్యా జగనూ ఈ గోడు ఆలకించవయ్యా !

Tags