NTR and Charan: నిన్న చెన్నైలో జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతూ ఎన్టీఆర్, చరణ్ లలోని గొప్ప గుణాల సీక్రెట్స్ ను చెప్పాడు. రాజమౌళి మాటల్లోనే.. ‘ఎన్టీఆర్ లాంటి నటుడు దొరకడం నేను చేసుకున్న అదృష్టమే కాదు, అలాగే ఒక్క తెలుగు సినిమానే కాదు, మొత్తం ఇండియన్ సినిమా చేసుకున్న అదృష్టం. అందుకే ఎన్టీఆర్ సినీ పరిశ్రమకే ఓ అదృష్టం. తన ప్రేమను తట్టుకోవడం చాలా కష్టం. ఒక్కసారిగా సునామీలో ప్రేమతో మన పై పడిపోతాడు.
ఇక చరణ్ నాకు నచ్చిన హీరో. చరణ్ నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అవి ఏమిటో చెప్పాలా ? చరణ్ ఎప్పుడు చాలా కూల్ గా ఉంటాడు. కూల్ గా ఎలా పని చేయాలో చరణ్ నుంచే నేను నేర్చుకున్నాను. నిజానికి ఎన్టీఆర్ – చరణ్ ఇద్దరూ పూర్తిగా విభిన్న ధ్రువాలు. ఎన్టీఆర్ మెరుపుదాడి లాంటి వాడు, చరణ్ సెక్యూర్ గా ఉంటాడు.
అయితే, ఇప్పుడు ఆ ఇద్దరూ ‘ఆర్‌ఆర్‌ఆర్’ అనే అయస్కాంతానికి అతుక్కుపోయి ఈ సినిమా చేశారు. ఇక వీరిద్దరి వల్ల సంతోష పడుతున్న వ్యక్తిని నేను. ఎన్టీఆర్ నటన మీకే కాదు, నాకు ఎంతో ఇష్టం. ‘బాహుబలి’ సినిమా నచ్చినట్లయితే.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ అంతకంటే ఎక్కువ నచ్చుతుంది’ అని రాజమౌళి చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఎన్టీఆర్ ను మెరుపు దాడి అని, చరణ్ ను సెక్యూర్ అని మొత్తానికి రాజమౌళి ఇద్దరి మధ్య తేడాని చాలా క్లారిటీగా చెప్పాడు.
Also Read: ‘రాజమౌళి’కి ఉన్న క్లారిటీ అమోహం !
ఏది ఏమైనా రాజమౌళి గొప్ప మార్కెటింగ్ జీనియస్. తన సినిమాను ఎలా మార్కెట్ చేసుకోవాలా జక్కన్నకు బాగా తెలుసు. ఏ డైరెక్టర్ అయినా తన చిత్రాలను జస్ట్ ప్రమోట్ మాత్రమే చేసుకుంటాడు. కానీ, రాజమౌళి మాత్రం తన సినిమాలను జనమే ప్రమోట్ చేసేలా ప్లాన్ చేస్తాడు. ఇక రాజమౌళి ప్రమోషనల్ స్ట్రాటజీలు కూడా చాలా కొత్తగా ఉంటాయి.
అన్నీ వర్గాల ప్రేక్షకులను థియేటర్స్ కి భారీ స్థాయిలో రప్పిస్తాడు. ప్రస్తుతం తన ఆర్ఆర్ఆర్ టీమ్ తో పాటు ప్రధాన నగరాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ సినిమాను బాగా ప్రమోట్ చేస్తున్నాడు. ఇప్పటికే సినిమా పై అందరికీ ఆసక్తి రెట్టింపు అయింది. ప్రపంచంలోని భారతీయులందరూ ‘ఆర్‌ఆర్‌ఆర్’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: మల్టీస్టారర్ కింగ్ మేకర్స్ ఆప్పుడు బాలచందర్.. ఇప్పుడు రాజమౌళి- జూ.ఎన్టీఆర్