Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh Premiere Shows Cancelled: ఆ సెంటిమెంట్ కారణంగానే 'ఉస్తాద్ భగత్ సింగ్...

Ustaad Bhagat Singh Premiere Shows Cancelled: ఆ సెంటిమెంట్ కారణంగానే ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ ప్రీమియర్స్ ని రద్దు చేశారా? హరీష్ మామూలోడు కాదుగా!

Ustaad Bhagat Singh Premiere Shows Cancelled: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎప్పుడో 2020 వ సంవత్సరం ఆరంభం లో ప్రకటించిన ఈ చిత్రం , అనేక కారణాల చేత మధ్యలో ఆగిపోవడం, ఆ తర్వాత మళ్లీ తిరిగి మొదలవ్వడం , పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ అవ్వడం వల్ల, రెండేళ్ల పాటు షూటింగ్ మొత్తం ఆగిపోవడం వంటివి చాలానే జరిగాయి. అలా అన్ని అడ్డంకులను దాటుకొని ఎట్టకేలకు షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 19 న విడుదల కాబోతుంది. అన్ని పెద్ద సినిమాలకు లాగానే ఈ సినిమాకు కూడా ఒక రోజు ముందుగానే ప్రీమియర్ షోస్ పడుతాయని అభిమానులు ఆశించారు. పవన్ కళ్యాణ్ గత రెండు చిత్రాలకు కూడా ప్రీమియర్ షోస్ పడ్డాయి.

Also Read: విడాకులు తీసుకున్న హీరోయిన్ హన్సిక.. కారణం చూస్తే ఆశ్చర్యపోతారు!

భారీ డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి కూడా ప్రీమియర్ షోస్ నుండి 19 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఓజీ’ చిత్రానికి ప్రీమియర్ షోస్ ద్వారా 35 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కేవలం ఇండియన్ బాక్స్ ఆఫీస్ నుండి వచ్చాయి. ప్రీమియర్ షోస్ కి ఉన్న పవర్ అలాంటిది. అంతటి వర్త్ ఉన్నటువంటి ప్రీమియర్స్ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ చిత్రానికి వేయకూడదని మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అందుకు ముఖ్య కారణం హరీష్ శంకర అట. ఎందుకంటే మార్చ్ 18 న అమావాస్య అట, సెంటిమెంట్స్ ని , ముహూర్తాలను బలంగా నమ్మే హరీష్ శంకర్, ఈ కారణం చేతనే ప్రీమియర్ షోస్ వద్దని నిర్మాతలతో చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పుడు మేకర్స్ 1 AM బెనిఫిట్ షోస్ , లేదా 4 AM స్పెషల్ షోస్ ని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారట.

రేపటి లోపు ఈ విషయం పై పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రీమియర్ షోస్ లేకపోవడం పై మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్రమైన అసంతృప్తి తో ఉన్నారు. ఇది ఇలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించిన ‘ఎత్తరా కాలర్ ఎత్తరా’ పాట రేపు సాయంత్రం విడుదల కాబోతుంది. విమల్ థియేటర్ లో అభిమానుల సమక్ష్యం లో పాటని విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఇక ట్రైలర్ ని మార్చి 4 న విడుదల చేయబోతున్నారు. అదే విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పెరేడ్ గ్రౌండ్స్ లో ఈ నెల 15 న నిర్వహించబోతున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version