Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu: మహేష్ బాబు డ్రీమ్ రోల్ ఏంటంటే..?

Mahesh Babu: మహేష్ బాబు డ్రీమ్ రోల్ ఏంటంటే..?

Mahesh Babu: సినిమా ఇండస్ట్రీలో అందమైన నటుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మహేష్ బాబు అనే చెప్పాలి. ఆయన అందంతో పాటు అభినయంలో కూడా తన సత్తా చాటుతున్నాడు. డిఫరెంట్ సినిమాలను చేయడంలో మహేష్ బాబు ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. కెరియర్ స్టార్టింగ్ లోనే ఎన్నో ప్రయోగాత్మకమైన సినిమాలను చేసి చాలామంది తెలుగు హీరోలకు ఆదర్శంగా నిలిచారు. అలాంటి మహేష్ బాబు ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో సైతం చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తుండటం విశేషం… ప్రస్తుతం ఆయన రాజమౌళి తో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది అనేది ఎవరు చెప్పలేరు. కానీ మొత్తానికైతే ఈ సినిమాని భారీ లెవల్లో తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది.

Also Read: విడాకులు తీసుకున్న హీరోయిన్ హన్సిక.. కారణం చూస్తే ఆశ్చర్యపోతారు!

మహేష్ బాబు ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నాడట. మహేష్ బాబు ఎన్ని పాత్రలు చేసిన కూడా తనకంటూ ఒక డ్రీమ్ రోల్ ఒకటి ఉందని పలు సందర్భాల్లో తెలియజేశాడు. ప్రతి దర్శకుడు తన దగ్గరికి డిఫరెంట్ పాత్రలతో వస్తున్నాడు తప్ప అలాంటి డ్రీమ్ రోల్ చేయమని మాత్రం తన దగ్గరికి ఎవరు రావడంలేదట. దానివల్ల అతను కొంత వరకు ఇబ్బందికి గురవుతున్నట్టుగా తెలుస్తుంది.

మరి ఆ పాత్ర ఏంటి అంటే వాళ్ళ నాన్న చేసిన ‘అల్లూరి సీతారామరాజు’ పాత్రని తను మరోసారి రీ క్రియేట్ చేయాలని చూస్తున్నారట. అలాంటి పాత్రతో సినిమాలు చేయాలంటే అది కత్తి మీద సాము లాంటిదే ఎందుకంటే ఒకప్పుడు వచ్చిన అల్లూరి సీతారామరాజు సినిమా అందరు చూశారు. ఇక అలాంటి పాత్రతో మహేష్ బాబు తో సినిమా అంటే ఇప్పుడున్న ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది కూడా తెలియాల్సి ఉంది…

ఇక దీన్ని బట్టి చాలామంది ప్రేక్షకులైతే మహేష్ బాబు డ్రీమ్ రోల్ ఇప్పుడప్పుడే తీరేలా లేదు. దానికి సెపరేట్ గా ఎవరైనా దర్శకుడు వచ్చి మహేష్ బాబు సినిమాని చేసి సక్సెస్ సాధిస్తే తప్ప ఇప్పుడున్న దర్శకులు ఎవరు కూడా అలాంటి సినిమాలు చేయలేరేమో అనే అభిప్రాయాలైతే వ్యక్తం చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version