Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న నటుడు చిరంజీవి… ఒక రకంగా చెప్పాలంటే ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. తనదైన రీతిలో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. 70 సంవత్సరాల వయసులో కూడా ఏమాత్రం తడబడకుండా యంగ్ హీరోలతో పాటు పోటీపడుతూ సినిమాలను చేస్తూ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్నాడు. రీసెంట్ గా ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన ఆయన డైరెక్షన్లో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. గతంలో వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాను మించి ఈ సినిమా ఉంటుందా? లేదా అనే ధోరణిలో కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి.
Also Read: విడాకులు తీసుకున్న హీరోయిన్ హన్సిక.. కారణం చూస్తే ఆశ్చర్యపోతారు!
ఇక ఈ తరం హీరోల్లో ముందుకు సాగుతున్న వారిలో విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టిలు మొదటి వరుసలో ఉన్నారు. అయితే వీళ్ళిద్దరు చిరంజీవి నుంచి వచ్చిన ఆఫర్ ను రిజెక్ట్ చేశారు. కారణం ఏంటి అంటే వీళ్ళిద్దరికి చిరంజీవి సినిమాలో నటించడం ఇష్టం లేదట…
లెజెండరీ నటుడితో నటించడానికి వాళ్లకు అంత మెచ్యూరిటీ లేదనే ఉద్దేశ్యంతోనే వాళ్ళిద్దరు ఆ సినిమాను రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. మొదట వాల్తేరు వీరయ్య సినిమా కోసం విజయ్ దేవరకొండ ను అప్రోచ్ అయ్యారట. రవితేజ చేసిన క్యారెక్టర్ లో విజయ్ దేవరకొండని తీసుకోవాలని మొదట ప్రయత్నం చేశారట. కానీ విజయ్ ఆ క్యారెక్టర్ ను రిజెక్ట్ చేశాడు.
ఇక దాంతో ఆ తర్వాత ఆ పాత్ర ను రవితేజ చేసి ఆ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంలో తను కీలకపాత్ర వహించాడనే చెప్పాలి… చిరంజీవి మలయాళ సినిమాని రీమేక్ చేసే సమయంలో నవీన్ పోలిశెట్టిని అడిగారు. కానీ నవీన్ పోలిశెట్టి దానిని రిజెక్ట్ చేశాడు. అయితే ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. మొత్తానికైతే ఈ ఇద్దరు యంగ్ హీరోలు చిరంజీవి సినిమాలను రిజెక్ట్ చేయడం మెగా అభిమానులు జీవించుకోలేకపోతున్నారు…