spot_img
Homeఆంధ్రప్రదేశ్‌తిరుపతిలో ప్రచారానికి జగన్‌

తిరుపతిలో ప్రచారానికి జగన్‌

CM Jagan
సాధారణంగా ఎక్కడైనా ఉప ఎన్నికలు వచ్చాయంటే.. అక్కడ ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రులు వెళ్లరు. కానీ.. ఇప్పుడు తిరుపతి లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ప్రచారంలో సీఎం జగన్‌ పాల్గొనాలని నిర్ణయించారు. 14వ తేదీన ఆయన తిరుపతిలో ఎన్నికల ప్రచారం చేయాలని డిసైడ్‌ అయ్యారు. 15తో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఆ ఒక్క రోజు ముందు జగన్‌ ప్రచారం చేయనున్నారు. అయితే.. ఇప్పటి వరకూ సీఎం జగన్ ఎన్నికల ప్రచారం చేస్తారని ఎవరూ ఎక్కడ చెప్పలేదు.

తిరుపతి ఉప ఎన్నికలో ఆయన ప్రచారం ఉండే చాన్స్ లేదని అనుకున్నారు. స్థానిక ఎన్నికల్లో సీఎం జగన్ ఓటు అడగకపోయినా జనం ఓట్లేశారని.. తిరుపతిలో కూడా అలాగే వేస్తారని వైసీపీ నేతలు చెప్పడం ప్రారంభించారు. అయితే.. అనూహ్యంగా సీఎం జగన్ ఓ రోజు ప్రచారానికి కేటాయించాలని నిర్ణయించుకోవడం ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే తిరుపతిలో వైసీపీ పక్కా వ్యూహం అమలు చేస్తోంది. పెద్ద ఎత్తున నేతలను మోహరించింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాధ్యత అప్పగించారు. ఏడు నియోజకవర్గాలకు ఒక్కో నియోజకవర్గానికి మంత్రిని..వారికి తోడుగా ఎమ్మెల్యేను పెట్టి.. ఓ టీమ్‌ను అప్పగించారు. ఇతర ప్రచారాలకు మంత్రులను ఉపయోగిస్తున్నారు. ఇక యాభై ఇళ్లకు ఓ వాలంటీర్ ఉండనే ఉన్నారు. ఇన్ని ఏర్పాట్ల మధ్య ఐదు లక్షల మెజార్టీని వైసీపీ టార్గెట్‌గా పెట్టుకుంది. అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఎమ్మెల్యేలే ఉండటం.. సామాజికవర్గ సమీకరణాలు కూడా కలసి రావడంతో వైసీపీకి తిరుగులేదనుకున్నారు. అందుకే జగన్ ప్రచారం చేయరని అనుకున్నారు.

కానీ.. ఎందుకో జగన్ తాను స్వయంగా ప్రచారానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తిరుపతి ఆధ్యాత్మక నియోజకవర్గం కావడం.. ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు హిందూ వ్యతిరేకి ముద్ర వేసినట్లుగా ఉండటంతో వాటిని కవర్ చేసుకోవాలంటే.. తాను ప్రచారానికి వెళ్లాలని ఆయన అనుకున్నట్లుగా చెబుతున్నారు. గతం కన్నా మెజార్టీ పెంచుకోవాలి కాబట్టి ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా ఉంది. మరో వైపు జగన్ హడావుడిగా ప్రచార షెడ్యూల్ ఖరారు చేసుకోవడంతో.. ఇతర పార్టీలు కొన్ని సందేహాలు లేవనెత్తుతున్నాయి. పరిస్థితి బాగో లేదు కాబట్టే.. జగన్ రంగలోకి దిగుతున్నారని అంటున్నాయి. ప్రజల్లో కూడా అలాంటి ప్రచారమే జరిగే అవకాశం ఉంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version