https://oktelugu.com/

అకౌంట్ ఓపెన్ చేస్తే రూ.లక్ష బెనిఫిట్.. ఏ బ్యాంక్ అంటే..?

ప్రముఖ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కేవలం 5 రూపాయలకే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా పెన్షనర్స్ అకౌంట్ సర్వీసుల పేరుతో ప్రత్యేక అకౌంట్ సర్వీసులను అందిస్తోంది. బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేసిన వాళ్లకు ఉచితంగా డెబిట్ కార్డ్ తో పాటు చెక్ బుక్ సౌకర్యాన్ని కూడా ఈ బ్యాంక్ అందిస్తుండటం గమనార్హం. ఈ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 7, 2021 / 03:31 PM IST
    Follow us on

    ప్రముఖ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కేవలం 5 రూపాయలకే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా పెన్షనర్స్ అకౌంట్ సర్వీసుల పేరుతో ప్రత్యేక అకౌంట్ సర్వీసులను అందిస్తోంది. బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేసిన వాళ్లకు ఉచితంగా డెబిట్ కార్డ్ తో పాటు చెక్ బుక్ సౌకర్యాన్ని కూడా ఈ బ్యాంక్ అందిస్తుండటం గమనార్హం.

    ఈ బ్యాంక్ పెన్షనర్స్ అకౌంట్ సర్వీసులకు సంబంధించిన ఖాతాను ఓపెన్ చేస్తే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా పొందే అవకాశం ఉంటుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని కల్పించడంతో పాటు రెండు నెలల పెన్షన్ డబ్బులకు సమానమైన ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని ఈ బ్యాంక్ అందిస్తుండటం గమనార్హం. ఎవరైతే ఈ అకౌంట్ ను ఓపెన్ చేస్తారో వారికి బ్యాంక్ లక్ష రూపాయల ఉచిత ప్రమాద భీమాను అందిస్తోంది.

    ఈ ప్రమాద బీమా వల్ల ఖాతాదారులకు ప్రయోజనం లభిస్తుంది. సమీపంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ ను సంప్రదించి పెన్షనర్స్ అకౌంట్ సర్వీసులకు సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. క్యాష్ విత్‌డ్రాయెల్స్‌ పై ఆంక్షలు లేకపోవడంతో పాటు వేరే ఊరిలో ఉన్న బ్యాంక్ బ్రాంచ్ నుంచి కూడా విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే రెండేళ్లకు ఒకసారి లావాదేవీ నిర్వహిస్తే మాత్రమే అకౌంట్ పని చేస్తుంది.

    సాధారణ సేవింగ్స్ ఖాతాకు వర్తించే వడ్డీరేటు ఈ ఖాతాకు కూడా వర్తించడం గమనార్హం. ఈ బ్యాంక్ అకౌంట్ కు మినిమమ్ బ్యాలన్స్ టెన్షన్ లేకపోవడంతో పాటు నామినీ ఫెసిలిటీ కూడా లభిస్తుంది