YCP: సాధారణంగా రాజకీయాల్లో( politics) వింత వైఖరి ఉంటుంది. ఒక్కోసారి దూకుడు అందలం ఎక్కిస్తుంది. పాతాళానికి తొక్కేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో బూతు నేతలుగా గుర్తింపు కలిగిన దూకుడు నాయకులది అదే పరిస్థితి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అడ్డదిడ్డంగా మాట్లాడేసారు. చిన్నా పెద్ద అన్న తారతమ్యం లేకుండా నోటికి ఎంత మాట వస్తే అంత మాట అన్నవారు కూడా ఉన్నారు. అటువంటి వారికి ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆప్షన్. జగన్మోహన్ రెడ్డి సైతం వారితోనే రాజకీయం చేయాలనుకున్నారు. గతంలో చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు సక్సెస్ కోసం వారితో అదే తరహా రాజకీయం చేయాలనుకుంటున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి తమ రాజకీయ జీవితంతో ఆటలాడుకున్నారన్న విషయాన్ని కొద్ది మంది గ్రహించారు. ఇంకా కొంతమంది మాట్లాడుతూనే ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మిగిలిపోయిన నేతలంతా.. ఏ పార్టీలో ఆప్షన్ లేని వారే. స్థానికంగా సర్దుబాటు కాని వారే.
* దూకుడు నేతలకు నో ఛాన్స్..
2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలామంది వైసిపి( YSR Congress party) నేతలు కూటమి పార్టీల్లో చేరారు. ఇలా చేరిన వారిలో దూకుడు కలిగిన నేతలు మాత్రం లేరు. ఒకరిద్దరూ స్థానికంగా ఉన్న సర్దుబాట్లు చేయాలన్న ఆలోచనతో టిడిపి తో పాటు జనసేన ఆహ్వానించాయి. మిగతా వారి విషయంలో మాత్రం నో ఎంట్రీ బోర్డు పెట్టేసాయి. అందులో జోగి రమేష్ లాంటి నేతలు కూడా ఉన్నారు. జోగి రమేష్ కేసుల దృష్ట్యా టిడిపిలో చేరేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది కలిగించేలా టిడిపి కూటమి ప్రజా ప్రతినిధులతో వేదిక పంచుకున్నారు. చంద్రబాబు సతీమణి విషయంలో శాసనసభలో జరిగింది తప్పు అని ఒప్పుకున్నారు. ఇలా ఎన్నో రకాలుగా కూటమికి అనుకూల వ్యాఖ్యలు చేశారు. కానీ టిడిపిలోకి జోగి రమేష్ ఎంట్రీకి ఎన్నో అవరోధాలు ఏర్పడ్డాయి. అయితే ఉత్తరాంధ్రాకు చెందిన సీనియర్ మాజీ మంత్రి కూడా టిడిపిలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన దూకుడు అడ్డుపడలేదు. జిల్లాస్థాయిలో ఆ స్థాయి నాయకుడిని అకామిడేట్ చేయలేమని టిడిపి నాయకత్వం తేల్చేసింది. అందుకే ఆయన చేరిక లేకుండా పోయింది.
* స్క్రిప్ట్ ఇచ్చే వారి కంటే చదివేవారు కి మూల్యం..
పేర్ని నాని( perni Nani ) , కొడాలి నాని, ఆర్కే రోజా, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, గుడివాడ అమర్నాథ్, వల్లభనేని వంశీ మోహన్లాంటి నేతలకు కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆప్షన్. ఎందుకంటే వారు ఇతర పార్టీల్లో చేరరు.. చేరలేరు కూడా. ఎందుకంటే వైసీపీలో ఉన్నప్పుడు బూతు నేతలుగా రెచ్చిపోయేవారు. నోరు తెరిస్తే నా కొడకా.. అంటూ అసభ్య పదజాలాలతో విరుచుకుపడేవారు. అయితే అది జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతోను.. సజ్జల రామకృష్ణారెడ్డి కంటెంట్ తోను ఈ విమర్శలు వెళ్లేవి. కానీ రాజకీయ భవిష్యత్తు పోయింది ఈ దూకుడు కలిగిన నేతలకే. స్క్రిప్ట్ ఇచ్చిన వారే కంటే.. చదివిన వారే ఎక్కువ మూల్యం చెల్లించుకున్నారు. రాజకీయంగా వారికి నో ఆప్షన్.. వన్ అండ్ ఓన్లీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ..