Homeఆంధ్రప్రదేశ్‌Jagan Political Strategy: రాజకీయ త్రాసులో జగన్‌.. మొగ్గు ఎటువైపో?

Jagan Political Strategy: రాజకీయ త్రాసులో జగన్‌.. మొగ్గు ఎటువైపో?

Jagan Political Strategy: ఐదేళ్లు ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్‌సీపీ.. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇటు అసెంబ్లీ స్థానాల్లో, అటు లోక్‌సభ స్థానాల్లో చిత్తుగా ఓడిపోయింది. ఆ తర్వాత ముగ్గురు రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామా చేశారు. దీంతో బలం 7కి పడిపోయింది. లోక్‌సభలో నలుగురు ఎంపీలు ఉన్నారు. ఇక మొన్నటి వరకు వైసీపీ కేంద్రంలో ఎవరికీ అవసరం లేని పార్టీగా మారింది. అయితే మారుతున్న రాజకీయ పరిస్థితులు.. ఇప్పుడు జగన్‌ ఎటో ఒకవైపు మొగ్గు చూపాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయ త్రాసులో ఉన్న జగన్‌ ఇప్పుడు ఎటువైపు మొగ్గుచూపుతారన్నది చర్చనీయాంశంగా మారింది.

Also Read: మంత్రివర్గ విస్తరణ.. చంద్రబాబు వ్యూహం అదే!

జగన్‌ గతంలో ఎన్డీయేకు మద్దతు..
2019 నుంచి 2024 వరకు జగన్‌ కేంద్రంలోని ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉన్నారు. 2022లో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ఎన్డీయే అభ్యర్థులకు మద్దతు ఇచ్చింది. అప్పట్లో వైసీపీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉంది, టీడీపీ కూడా ఎన్డీయే అభ్యర్థులకు మద్దతిచ్చింది. ఈ నేపథ్యంలో, జగన్‌ బీజేపీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. 2014 నుంచి 2019 వరకు బీజేపీ వైసీపీకి పరోక్ష మద్దతు ఇచ్చిందని, అదే సమయంలో టీడీపీతో కూటమిలో ఉంటూ రాజకీయ సమతుల్యత పాటించింది. జగన్‌ ఎన్డీయేకు మద్దతిచ్చినప్పుడు, కాంగ్రెస్‌ నాయకత్వంలోని ఇండియా కూటమితో దూరం పాటించారు. కాంగ్రెస్‌తో జగన్‌కు ఉన్న గత రాజకీయ విభేదాలు, ముఖ్యంగా 2014లో తెలంగాణ విభజన, ఆయన జైలు శిక్ష వంటి అంశాలు ఈ నిర్ణయంలో ప్రభావం చూపాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే అధికారంలో ఉంది, వైసీపీ విపక్షంగా ఉంది. లిక్కర్‌ స్కామ్‌ వంటి వివాదాలతో వైసీపీ నాయకులు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌ రాజకీయ వైఖరిలో ఎలాంటి మార్పు ఉంటుంది అనేది చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీయే బలం ఇలా..
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలక్టోరల్‌ కాలేజీలో ఎన్డీయేకు స్పష్టమైన మెజారిటీ ఉంది. మొత్తం 786 ఓట్లలో ఎన్డీయేకు 422 ఎంపీల మద్దతు ఉందని, ఇండియా కూటమికి సుమారు 150 ఎంపీల మద్దతు ఉందని అంచనా. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయేకు 25 ఎంపీల మద్దతు(లోక్‌సభలో 21, రాజ్యసభలో 4) ఉంది. అయితే వైసీపీ 11 ఓట్లు ఎన్డీయేకు అదనపు బలాన్ని ఇవ్వగలవు. బీజేపీ ఎప్పుడూ తమ మిత్రపక్షాలను, తటస్థ పార్టీలను ఆకర్షించడంలో నైపుణ్యం కలిగి ఉంది, వైసీపీ ఓట్లు ఈ ఎన్నికల్లో కీలకంగా మారవచ్చు. కాంగ్రెస్‌ బలపడకుండా చూసేందుకు తటస్థ పార్టీలైన వైసీపీ, బీజేడీ, బీఆర్‌ఎస్‌ వంటి వాటిని బీజేపీ తమ వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. జగన్‌ మద్దతు ఎన్డీయేకు దక్కితే, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ రాజకీయ ప్రభావం మరింత పెరుగుతుంది. ఇదే సమయంలో ఎన్డీయేకు మద్దతు ఇవ్వడం ద్వారా వైసీపీ నాయకులపై ఉన్న కేసులు, ఒత్తిడులు తగ్గే అవకాశం ఉంటుందని జగన్‌ భావిస్తున్నారు.

ఇండియా కూటమి వైసీపీ దూరం..
కాంగ్రెస్‌తో గతంలో ఉన్న విభేదాల కారణంగా జగన్‌ ఇండియా కూటమికి మద్దతిచ్చే అవకాశం చాలా తక్కువ. 2024 జులైలో జగన్‌ ఢిల్లీలో నిర్వహించిన నిరసన ర్యాలీకి ఇండియా కూటమి నాయకులు(అఖిలేష్‌ యాదవ్‌ వంటివారు) మద్దతు ఇచ్చినప్పటికీ, కాంగ్రెస్‌ ప్రతినిధులు దూరంగా ఉన్నారు. జగన్‌ సోదరి వైఎస్‌.షర్మిల నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీతో ఉన్న విభేదాలు ఈ దూరానికి కారణంగా చెప్పవచ్చు. 2014లో తెలంగాణ విభజన సమయంలో కాంగ్రెస్‌ చర్యలు, జగన్‌పై సీబీఐ, ఈడీ కేసులు వైసీపీని కాంగ్రెస్‌కు దూరం చేశాయి. ఇండియా కూటమితో జతకట్టడం కూడా జగన్‌కు రాజకీయంగా నష్టం కలిగించవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Also Read:  జాతీయస్థాయిలో జగన్ ఎటువైపు?

తటస్థంగా ఉంటారా?
జగన్‌ ఎన్డీయేకు మద్దతిచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంది. ఎన్డీయేలో టీడీపీ, జనసేన, బీజేపీ ఇప్పటికే బలంగా ఉన్నాయి. వైసీపీ మద్దతు బీజేపీకి రాష్ట్రంలో మరింత పట్టు ఇవ్వవచ్చు. అయితే, ఇది వైసీపీకి రాజకీయంగా నష్టం కలిగించే అవకాశం ఉంది. టీడీపీతో శత్రుత్వం ఉన్న వైసీపీ ఎన్డీయేకు మద్దతిస్తే, రాష్ట్రంలో తమ ఓటు బ్యాంకును కోల్పోయే ప్రమాదం ఉంది.
అయితే ఇదేమయంలో ప్రస్తుతం వైసీపీ నాయకులపై లిక్కర్‌ స్కామ్‌ కేసులు, అరెస్టులు ఒత్తిడిని పెంచుతున్నాయి. ఎన్డీయేకు మద్దతిచ్చినట్లయితే, ఈ కేసుల్లో కొంత ఉపశమనం పొందే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. ఇక ఇండియా కూటమితో జతకడితే, రాష్ట్రంలో టీడీపీ–జనసేన కూటమికి వ్యతిరేకంగా బలమైన విపక్షంగా నిలిచే అవకాశం ఉంది, కానీ ఇది కాంగ్రెస్‌తో సంబంధాలను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే తటస్థంగా ఉండాల్సి ఉంటుంది. తటస్థ వైఖరి అవలంబించడం ద్వారా జగన్‌ రాష్ట్ర, జాతీయ ప్రయోజనాలను సమతుల్యం చేయవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version