Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాలపై ప్రభుత్వం కొరఢా ఝుళిపించింది. నిబంధనలు కఠినతరం చేసింది. దీంతో ఇకపై రోడ్లమీద మద్యం అమ్మకాలు వద్దని వారిస్తోంది. ఇందు కోసం అన్ని ప్రణాళికలు సిద్ధం చేసింది. మందుబాబుల ఆగడాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మద్యం అమ్మకాలపై ప్రభుత్వం కన్నెర్ర జేసింది.
రోడ్డుప్రమాదాలకు కారణం మద్యం సేవించడమే. దీంతో చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే మద్యం అమ్మకాలు నడిరోడ్డుపై వద్దంటూ ప్రభుత్వం వారించే ప్రయత్నాలు చేస్తోంది. అందుకే మందుబాబుల ఆగడాలు తగ్గించేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మందుబాబుల వీరంగాలను అడ్డుకోవాలని చూస్తోంది.
Also Read: ప్రత్యేక హోదా’ ఆ ఎన్నిక కోసమేనా?
రోడ్ల మీద మందు అమ్మకానికి అనుమతులు ఇచ్చింది ప్రభుత్వమే. ఇప్పుడు వద్దంటుంది ప్రభుత్వమే. దీంతో ప్రభుత్వ నిర్వాకంతోనే మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతోందనే విమర్శలు సైతం లేకపోలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం ఇక రోడ్లపై అమ్మొద్దని సూచించడం చూస్తుంటే మద్యం అమ్మకాలపై నిబంధనలు విధిస్తున్నా దాని ప్రభావం ఎంత మేర కనిపిస్తుందో తెలియడం లేదు.
మరోవైపు రాష్ట్రానికి ప్రధాన ఆదాయం మద్యంతోనే కావడం తెలిసిందే. ఎన్నికల ముందు జరిగిన పాదయాత్రలో జగన్ సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తామని హామీ ఇచ్చినా అది నెరవేరేలా కనిపించడం లేదు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలను నిషేధిస్తే ప్రభుత్వ ఆదాయానికి గండి పడే అవకాశం ఉంటుంది. దీంతోనే ప్రభుత్వం ఆ సాహసం చేయదని తెలుస్తోంది. కానీ రోడ్లపై మద్యం అమ్మకాలు నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవడం మాత్రం సమంజసమే.
Also Read: జగన్ ను ఇరుకున పెట్టిన కేసీఆర్