https://oktelugu.com/

Sarkaru Vaari Paata: అదరగొడుతున్న కళావతి.. 19 మిలియన్ వ్యూస్ !

Sarkaru Vaari Paata: సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు – సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ ‘సర్కారు వారి పాట’ నుంచి లవ్ సాంగ్ కళావతి అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం ఒక ఊపు ఊపేస్తోంది. కాగా ఇప్పటి వరకూ 19 మిలియన్ వ్యూస్ ను సాధించింది. పైగా, 912 కే కి పైగా లైక్స్ ను సాధించి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. మొత్తానికి ఈ పాటకు సోషల్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 15, 2022 / 01:08 PM IST
    Follow us on

    Sarkaru Vaari Paata: సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు – సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ ‘సర్కారు వారి పాట’ నుంచి లవ్ సాంగ్ కళావతి అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం ఒక ఊపు ఊపేస్తోంది. కాగా ఇప్పటి వరకూ 19 మిలియన్ వ్యూస్ ను సాధించింది. పైగా, 912 కే కి పైగా లైక్స్ ను సాధించి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

    Kalavathi Song

    మొత్తానికి ఈ పాటకు సోషల్ మీడియా లో సైతం భారీ రెస్పాన్స్ వస్తోంది. కాగా మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన ఈ పాట సోషల్ మీడియాలో లీకైంది. సోషల్ మీడియాలో మొత్తం పాట వైరల్ కావడంతో.. సైబర్ క్రైమ్ పోలీసులకు SVP యూనిట్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఈ పాటకు పైరసీ బెడద గట్టిగానే తగిలినా ఈ పాట మాత్రం ఓ ఊపు ఊపేస్తోంది.

    Also Read:  చైనాపై ఆధారపడకుండా భారత్ ఉండలేదా..?

    పైగా ఇప్పటికే ఈ పాట మరో రికార్డును కూడా తన పేరిట లిఖియించుకుంది. యూట్యూబ్‌లో అత్యంత వేగంగా 70 లక్షలకు పైగా వ్యూస్, 500Kకు పైగా లైకులను సంపాదించింది. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న కాగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.

    Sarkaru Vaari Paata

    కాగా ఈ సినిమాని మే 12, 2022 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. చంద్రబోస్ రాసిన ఈ లవ్ సాంగ్ చాలా ఎఫెక్టివ్ గా ఉంది. మహేష్ బాబు, కీర్తి సురేష్ జంట కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. ఏది ఏమైనా ఈ ‘కళావతి’ లిరికల్ సాంగ్ ప్రస్తుతం అదరగొడుతోంది.

    Also Read: ‘సుందరకాండ’ సెకండ్ హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు ?

    Tags