Vijay Setupathi: కోలీవుడ్ ప్రముఖ హీరో విజయ్ సేతుపతిపై ఇటీవలే బెంగళూరు విమానాశ్రయంలో ఉన్నప్పుడు ఓ వ్యక్తి దాడి చేసేందుకు ప్రయత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన విజయ్.. సమస్యను పెద్దది చేయకండని.. అసలు అదేం పెద్ద విషయం కాదని కొట్టిపడేశారు. అయితే, తాజాగా, మక్కల్ కట్చి అనే ఓ హిందూ సంస్థ విజయ్ సేతుపతిపై దాడి చేసిన వారికి రూ. 1,001 బహుమతిని ప్రకటించడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
ఈ విషయాన్ని ఆ సంస్థ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. విజయ్ సేతుపతి స్వాతంత్య్ర సమరయోధుడు దైవతిరు పసుంపోన్ ముత్తురామలింగ తేవర్ అయ్యను, దేశాన్ని అవమానించాడని.. అందుకు సంబంధించిన ఓ వీడియో స్క్రీన్ షాట్‌ను పోస్ట్ చేసింది. తేవర్ అయ్యను అవమానపరిచినందుకు విజయ్ సేతుపతిపై దాడి చేసిన వారికి నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించింది. ఆయన చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పే వరకు విజయ్ సేతుపతిపై ఈ ఆఫర్ కొనసాగుతుందని అన్నారు.
தேவர் அய்யாவை இழிவுபடுத்தியதற்காக நடிகர் விஜய் சேதுபதியை உதைப்பவருக்கு ரொக்கப்பரிசு ரூ.1001/- வழங்கப்படும் – அர்ஜூன் சம்பத் அறிவித்துள்ளார்.
விஜய் சேதுபதி மன்னிப்பு கேட்கும் வரை அவரை உதைப்பவருக்கு
1 உதை = ரூ.1001/- pic.twitter.com/nFDtcMwn1J
— Indu Makkal Katchi (off) (@Indumakalktchi) November 7, 2021
విజయ్ సేతుపతిపై దాడికి ప్రయత్నించిన వ్యక్తి పేరు మహా గాంధీ అని, విజయ్ సేతుపతికి జాతీయ అవార్డు వచ్చినందుకు మహాగాంధీ శుభాకాంక్షలు చెప్పాలనుకున్నారని, కానీ విజయ్ సేతుపతి వ్యంగ్యంగా మాట్లాడడమే వాగ్వాదానికి దారి తీసిందని అర్జున్ సంపత్ అన్నారు.
ప్రస్తుతం విజయ్ విక్రమ్ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో కమల్ హాసన్ హీరోగా కనిపించనుండగా.. విజయ్ కీలకపాత్రలో అలరించనున్నాడు. ఇటీవలే కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.