CM Chandrababu : mకేంద్ర పెద్దల వద్ద ఏపీ సీఎం చంద్రబాబుకు( CM Chandrababu) గుర్తింపు కొనసాగుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు ప్రాధాన్యం కూడా పెరిగింది. ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామిగా మారింది. ఏపీ నుంచి రాజకీయంగా రాజ్యసభ ఇతరత్రా పదవుల్లో బిజెపికి కూడా ప్రాధాన్యం ఇస్తోంది టిడిపి కూటమి. పరస్పర సహకారంతో కూటమి పార్టీలు ముందుకు సాగుతున్నాయి. గత అనుభవాల దృష్ట్యా కేంద్ర పెద్దలతో చంద్రబాబు సఖ్యతగా మెలుగుతున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పరస్పరం ప్రశంసలు కురిపించుకుంటున్నారు. ఈరోజు నీతి ఆయోగ్ సమావేశంలో సైతం ఆ ఇరువురి నేతలు పరస్పరం గౌరవించుకున్నారు. ముఖ్యంగా చంద్రబాబు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు ప్రధాని మోదీ ముద్దుడయ్యారు. తన మనసులో ఉన్న మాటలు బయట పెట్టారు. ఏపీ సీఎం చంద్రబాబును ఆదర్శంగా తీసుకోవాలని మిగతా ముఖ్యమంత్రులకు సూచించారు.
* చంద్రబాబు బిజీబిజీ..
మూడు రోజుల పర్యటన నిమిత్తం ఏపీ సీఎం చంద్రబాబు గురువారం రాత్రి ఢిల్లీ( Delhi) చేరుకున్నారు. నిన్న రోజంతా బిజీగా గడిపారు. వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈరోజు నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ సీఎం హోదాలో పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు అధికారులు హాజరయ్యారు. ముఖ్యంగా వికసిత్ భారత్ కు సంబంధించి రాష్ట్రాలు తమ సూచనలు, సలహాలు పంచుకున్నాయి. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు తనవంతుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏపీలో తాను అమలు చేస్తున్న పి 4 కార్యక్రమంతో పాటు ఎన్డీఏ ప్రభుత్వాల ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి అంశాలను ప్రస్తావించారు. ఏపీలో తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు కేంద్రం అందిస్తున్న సహకారాన్ని కూడా ప్రస్తావించారు.
Also Read అద్భుతమైన బిజినెస్ ఐడియా.. పెట్టుబడి లేకుండా ఇంట్లో కూర్చొని లక్షల్లో సంపాదించవచ్చు..
* ఏపీకి సహకారం అందించండి..
నీతి ఆయోగ్( Niti Aayog) భేటీలో ఏపీకి సహకారం అందించాలని ప్రధాని మోదీతో పాటు కేంద్ర పెద్దలకు విజ్ఞప్తి చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశాఖను అభివృద్ధి చేస్తున్నామని.. ఇందులో భాగంగా నాలుగు జోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇదే మోడల్ ను అమరావతి, కర్నూలు, తిరుపతికి కూడా విస్తరించేలా కేంద్రం సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు చంద్రబాబు. డిజిటల్ పాలనను అమలు చేస్తున్నామని.. ఇందులో భాగంగా ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ పాస్ బుక్ కూడా ఇస్తామన్నారు. చంద్రబాబు ప్రజెంటేషన్ పూర్తిగా విన్న ప్రధాని మోదీ.. వికసిత్ భారత్ కోసం చంద్రబాబు ఇచ్చిన సూచనలను తప్పకుండా పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. చంద్రబాబు ఇచ్చిన సూచనలను ఇతర రాష్ట్రాలు కూడా పరిశీలించాలని ప్రధాని మోడీ సూచించారు. చంద్రబాబు సూచనలు వికసిత్ భారత్ కు ఉపయోగపడేలా ఉన్నాయని కితాబిచ్చారు. ప్రధాని మోదీ తో పాటు ఈ భేటీకి హాజరైన ఇతర వ్యక్తులు కూడా చంద్రబాబు సూచనలను స్వాగతించారు. చంద్రబాబుకు అభినందనలు తెలిపారు.