Side Business : ఇటువంటి వారి కోసం మార్కెట్లో ఎన్నో కొత్త రకాల బిజినెస్ లు అందుబాటులో ఉన్నాయి. ఇంటి నుంచి చేసే వ్యాపారాలు కూడా చాలా ఉన్నాయి. ఇంటి నుంచి చేసే వ్యాపారంలో మంచి లాభాలు పొందే వ్యాపారం గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్లే ఆర్ట్ బిజినెస్ కు మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారంలో లక్షల్లో ఆదాయం పొందవచ్చు. ఇది కేవలం మట్టి తోటి కళ మాత్రమే కాదు ఇది ఒక డ్రీమ్ డిజైన్ అని కూడా చెప్పొచ్చు. ప్రతి ఒక్కరి జీవితంలో అతిపెద్ద లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు లేదా జీవితంలో ఏదైనా పెద్ద విజయం సాధించినప్పుడు దానిని ఒక గోడ మీద చూపించే ప్రయత్నమే ఇది. క్లే ఆర్ట్ అనేది ఒక ఇంటీరియర్ డెకరేషన్ టెక్నిక్ లాగా కనిపించినా కూడా దీని వెనక ఉన్న అర్థం మాత్రం చాలా గంభీరమైనది అని చెప్పొచ్చు. హై ప్రొఫైల్ బంగ్లాల్లో ముఖ్యంగా క్లే ఆర్ట్ ప్రత్యేకంగా చేయించుకుంటూ ఉంటారు. నగరాలలో ప్రస్తుతం దీని డిమాండ్ తక్కువగా ఉన్నప్పటికీ గ్రామాలలో మాత్రం దీనికి ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. పల్లెటూర్లలో ఉన్న ఇళ్లలో పెద్ద పెద్ద గోడలపై క్లే ఆర్ట్ చాలా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. దీనిని మీరు ఒక వ్యాపారంగా ప్రారంభించినట్లయితే గ్రామాల నుంచి మీరు నగరాలలో కూడా విస్తరించవచ్చు.
విదేశాలలో మన దేశ క్లే ఆర్ట్ కు బాగా ఆదరణ ఉంది. మన దేశ ఆర్టిస్టులను ప్రత్యేకంగా ఆహ్వానించి అమెరికా, కెనడా, యూరోప్ వంటి దేశాలలో తమ ఇళ్లలోని గోడలపై క్లే ఆర్ట్ చేయించుకుంటారు. నిర్వాహకులే ఆ ఆర్టిస్టులకు ప్రయాణ ఖర్చులతో పాటు వసతి ఖర్చులు అన్నీ కూడా భరిస్తారు. అలాగే మన దగ్గర తయారైన క్లే ఆర్ట్ కు సంబంధించిన ఫోటో ఫ్రేమ్ లను ఆన్లైన్లో ఆర్డర్ చేసి విదేశాలకు కూడా పంపిస్తూ ఉంటారు చాలామంది. కొన్ని కొన్ని సార్లు ఇలా విదేశాలకు పంపించే సమయంలో ఫోటో ఫ్రేమ్ కంటే కూడా ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది.
కానీ వాళ్లు ఈ ఖర్చులను భరించడానికి రెడీగా ఉంటారు. అయితే మార్కెట్లో చాలా డిమాండ్ ఉన్న క్లే ఆర్ట్ వర్క్ నేర్చుకోవడానికి మీరు ప్రత్యేకంగా శిక్షణ పొందాల్సిన అవసరం లేదు. చాలామందికి చిన్నతనంలో మట్టి బొమ్మలను తయారు చేయడం అంటే చాలా ఇష్టం. మన సంస్కృతిలోనే ఈ కళ ఉంది. యూట్యూబ్లో కూడా దీనికి సంబంధించి చాలా ట్యుటోరియల్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు. క్లే ఆర్ట్ ఎలా చేయాలి, దీనికి మట్టి ఎలా తయారు చేయాల్సి ఉంటుంది, ఎలా డ్రై చేయాలి అన్ని కూడా మీకు వివరంగా వీడియోలలో యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి.