Viral Photo : తొలి సినిమాతోనే మంచి విజయం అందుకొని ఫుల్ తెచ్చుకున్న హీరోయిన్లు తెలుగులో చాలామంది ఉన్నారు.తమ అందంతో, అభినయంతో తొలి సినిమాతోనే ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నారు. కానీ ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే సినిమా ఇండస్ట్రీకి దూరమైన వాళ్ళు కూడా ఉన్నారు. తొలి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ముద్దుగుమ్మలు చాలామంది తెలుగులో ఆ తర్వాత అనుకున్న స్థాయిలో అవకాశాలు మాత్రం అందుకోలేక పోయారు. సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త అందాలు పరిచయం అవుతూ ఉంటాయి. కానీ ఒక్క సినిమాతోనే బాగా క్రేజ్ తెచ్చుకొని ఎప్పటికీ ప్రేక్షకుల మనసులో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్నారు. తొలి సినిమాతో భారీ విజయం సొంతం చేసుకొని ఆ తర్వాత కేవలం ఒకటి రెండు సినిమాలలో కనిపించి సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు చాలామంది ముద్దుగుమ్మలు. అసిమా భల్ల కూడా ఈ జాబితాలో ఒకరు.
Also Read : చంద్రబాబు చేసిన పనికి మోదీ స్ట్రాంగ్ రియాక్షన్!
ఈమె పేరు చెబితే తెలుగు ప్రేక్షకులు గుర్తుపట్టలేక పోవచ్చు కానీ వేణు హీరో నటించిన చెప్పవే చిరుగాలి సినిమా హీరోయిన్ నిర్మల అంటే తెలుగు ప్రేక్షకులు బాగా గుర్తుపడతారు. నిర్మల అనే పాత్రలో అశిమ తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానాన్ని సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ ప్యార్ జిందగీ హై అని సినిమాతో 2001లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇక 2001లోనే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటించిన డాడీ సినిమాతో టాలీవుడ్ సినిమా ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయం అయింది. అయితే ఈ సినిమాలో సిమ్రాన్ మెయిన్ హీరోయిన్ గా కనిపించగా ఆశీమ సెకండ్ హీరోయిన్ గా నటించింది. తెలుగుతోపాటు తమిళ్, హిందీలో కూడా ఆశిమ పలు సినిమాలలో నటించి బాగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో చెప్పవే చిరుగాలి సినిమాతో ఈమెకు ఫుల్ క్రేజ్ వచ్చింది. నిర్మల పాత్రలో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.
ఇక చివరి సారిగా అషిమ భళ్ళ తెలుగులో తంబి అర్జునుడు అనే సినిమాలో నటించింది. బుల్లితెర మీద పలు టీవీ షోలలో కూడా అశీమ సందడి చేసింది. ప్రస్తుతం మాత్రం ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా అషిమ భళ్ళ షేర్ చేసిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికీ కూడా అంతే అందంతో అషిమ భళ్ళ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది.
View this post on Instagram