Chiranjeevi: రాష్ర్టపతి ఎన్నికకు ఇంకా సమయం ఉండగానే ఆ పదవిపై ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి. దేశంలోనే అత్యున్నత పదవి కావడంతో అందరికి ఆశలు ఉండటం సహజమే. కానీ రాష్ర్టపతి పదవిపై ప్రస్తుతం రకరకాల ఆలోచనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు తమ మనసులోని మాటలు బయటపెడుతూ రాష్ర్టపతి పదవిపై అందరికి ఆశలు పెంచుతున్నారని తెలుస్తోంది.

బుధవారం హైదరాబాద్ లోని ఓ కార్యక్రమానికి హాజరైన ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవి కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన మనసులోని మాట బయటపెట్టారు. వెంకయ్యనాయుడును రాష్ర్టపతిగా చూడాలనుకుంటున్నామని చెప్పారు. దీంతో అందరిలో ఆశ్చర్యం వ్యక్తమైంది. తెలుగువారికి అత్యున్నత పదవులు దక్కాలన్నది ఆయన కోరికలోని ఆంతర్యమని తెలిసినా ఇలా బహిరంగంగా బహిర్గతం చేయడంతో ఇప్పుడు అది చర్చనీయాంశం అవుతోంది.
గతంలో కూడా మెగాస్టార్ చిరంజీవి నాగబాబు రాష్ర్టపతి పదవికి రతన్ టాటానే అర్హుడని కుండబద్దలు కొట్టారు. దీంతో ఆయనకు పదవిపై ఆశ ఉందో లేదో తెలియదు కానీ నాగబాబు మాటలతో ఆయన ఉలిక్కి పడినట్లు తెలుస్తోంది. వ్యాపారస్తులకు సహజంగా రాజకీయాలపై అంత ఆసక్తి ఉండదని తెలిసినా అవేవీ పట్టించుకోని నాగబాబు ఆయన మనసులో దాచుకోకుండా బయటపెట్టి అప్పట్లో సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే.
Also Read: Vikram movie: విక్రమ్ సినిమా షూటింగ్ షురూ.. కమల్‌తో పాటు బరిలోకి ఆ ఇద్దరు హీరోలు!
ప్రస్తుతం మెగా బ్రదర్స్ నోట రాష్ర్టపతి మాటలు రావడంలో మతలబు ఏమై ఉంటుందనేది అందరిలో వ్యక్తమవుతున్న ప్రశ్న. నిజానికి వెంకయ్య నాయుడుకు ఆ పదవిపై ఆశ లేదన్నట్లుగానే స్పష్టమవుతోంది. కానీ చిరంజీవి ప్రస్తావతో ఆయన డైలమాలో పడినట్లు సమాచారం. ఏదైనా మనసులో ఉంటే మొదట వారితోనే చర్చించి తరువాత బయట పెడితే బాగుంటందనేది అందరిలో వ్యక్తమవుతున్న అభిప్రాయం. మొత్తానికి మెగా బ్రదర్స్ రాజకీయాల్లో మరో బాంబు పేల్చారనే వానదలు రాజకీయ విశ్లేషకుల్లో వస్తున్నాయి.
Also Read: KCR vs BJP: బీజేపీని కొట్టేయాలి.. కేసీఆర్ కేబినెట్ విస్తరణ వెనుక భారీ ప్లాన్?