Homeఎంటర్టైన్మెంట్ఎలిమినేటైన అవినాష్ కి నాగార్జున అదిరిపోయే గిఫ్ట్

ఎలిమినేటైన అవినాష్ కి నాగార్జున అదిరిపోయే గిఫ్ట్

Avinash
బిగ్ బాస్ సీజన్ 4లో ప్రేక్షకులను ఆకట్టుకున్న కంటెస్టెంట్స్ లో ముక్కు అవినాష్ ఒకడు. జబర్థస్త్ కమెడియన్ హోదాలో హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్, స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా 13 వారాలు కొనసాగాడు. హౌస్ లో కామెడీ పంచడంలో సక్సెస్ అయిన అవినాష్, రియల్ ఎంటర్టైనర్ అనే పేరు తెచ్చుకున్నారు. ఐతే సింపథీ గేమ్ ఆడడం, నామినేషన్స్ కి భయపడడం, కొన్ని సార్లు చిన్న విషయాలకు కూడా సహనం కోల్పోయి కోప్పడడం, అతనిపై ప్రేక్షకులలో నెగిటివ్ అభిప్రాయం వచ్చేలా చేశాయి.

Also Read: నిహారిక పెళ్లికి పవన్ భార్య ఎందుకు వెళ్ళలేదంటే..?

ఏది ఏమైనా హౌస్ నుండి బయటికి వచ్చిన అవినాష్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. బిగ్ బాస్ హౌస్ లో తన అనుభవాలు, కంటెస్టెంట్స్ ప్రవర్తన వంటి అనేక విషయాలపై తన అభిప్రాయం తెలియజేస్తున్నాడు. యూట్యూబ్ ఛానల్ లో అవినాష్ ని యాంకర్ శ్రీముఖి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయం అవినాష్ బయటపెట్టాడు. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున ఓ అరుదైన బహుమతి అవినాష్ కి ఇచ్చారట.

Also Read: త‌మ‌న్నా, మెహ‌రీన్‌ మళ్లీ ఓ రేంజ్ లో కుమ్మేస్తారట !

హౌస్ లో ఉన్న సమయంలో వారాంతంలో హోస్ట్ గా వచ్చిన నాగార్జున చొక్కా చాలా బాగుందని అవినాష్ పొగిడారు. రెడ్ కలర్, ఫ్లవర్ డిజైన్ కలిగిన ఆ షర్ట్ అవినాష్ కి నచ్చిందని తెలుసుకొన్న నాగ్, ఆ షర్ట్ అతనికి గిఫ్ట్ గా ఇచ్చాడట. ఆ రోజు షో ముగిసిన తరువాత నాగార్జున ఆ షర్ట్, అవినాష్ కి చేర్చాలని నిర్వాహకులకు చెప్పాడట. ఇంటి నుండి బయటికి వచ్చిన అవినాష్ , నాగార్జున గిఫ్ట్ గా ఇచ్చిన ఆ షర్ట్ ధరించి సోషల్ మీడియాలో పోజులిచ్చాడు. నాగార్జున లాంటి స్టార్ తన కోరిక మన్నించి తనకు షర్ట్ గిఫ్ట్ గా ఇవ్వడాన్ని గొప్పగా ఫీలవుతున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Nagarjuna Surprise Gift to Avinash | Bigg Boss4 Telugu | Ok Telugu

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version