రాష్ట్రంలో టీడీపీకి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు అమరావతి ఉద్యమం ఆయనకు కొందరు నేతలను దూరం చేస్తుంది. ఇప్పటికే కరోనా విపత్తు సమయంలో ప్రతిపక్ష నేత పక్క రాష్ట్రంలో మకాం పెట్టడం అనేక విమర్శలకు దారితీస్తుంది. సామాన్యులు సైతం ఈ విషయంలో బాబును మరియు లోకేష్ ని ఎండగడుతున్నారు. అమరావతి కోసం ఆయన జూమ్ యాప్ లో చేస్తున్న ఉద్యమాలు, సవాళ్లు ఆయన పట్ల గౌరవం పెంచకపోగా ఇంకా చులక చేస్తున్నాయి. బాబు జూమ్ పోరాటాలు, లోకేష్ ట్విట్టర్ వ్యాఖ్యలు ప్రజలపై పనిచేయడం లేదు. దీనికి తోడు వైసీపీ నేతలు బాబును జూమ్ బాబా అని, లోకేష్ ని ట్విట్టర్ పిట్ట అని ఎద్దేవా చేస్తున్నారు. అమరావతి కోసం బాబు చేస్తున్న సోషల్ మీడియా ఉద్యమం ఆయనకు మేలు చేసే సూచనలు కనిపించడం లేదు.
Also Read: ఆంధ్రలో బిజెపి-జనసేన కూటమికి పవన్ కళ్యాణ్ నాయకత్వం?
మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ కొందరు నేతలు టీడీపీకి దూరం కానున్నారు. వైజాగ్ లో నాలుగు నియోజకవర్గాలను శాశించగల గంటా శ్రీనివాసరావు టీడీపీని వీడడం పెద్ద దెబ్బే అని చెప్పాలి. త్వరలో ఆయన వైసీపీలో చేరిక ఖాయమే. రాయలసీమలో వైసీపీ ఎలాగూ బలంగా ఉంది. టీడీపీ కంచు కోటైన ఉత్తరాంధ్రలో పసుపు జెండాను కనుమరుగు చేయడం ద్వారా రాష్ట్రంపై పూర్తి పట్టు సాధించాలని వైసీపీ భావిస్తుంది. సీనియర్ టీడీపీ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా కమల దళంలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి. రాను రాను టీడీపీ పరిస్థితి మరింత దిగజారుతుంటే బాబుకు మాత్రం అమరావతి ఉద్యమం మినహా ఏమీ కనిపించడం లేదు. క్షేత్ర స్థాయిలో జగన్ పాలనలో లోపాలు ఎత్తిచూపుతూ ప్రజాపోరాటం చేస్తే కొంచెమైనా నష్టనివారణ జరిగే అవకాశం ఉంటుంది.
Also Read: జిల్లాల పునర్యవస్ధీకరణకు తొలి అడుగు..!
బాబు రాజకీయం అమరావతే అజెండా సాగుతుండగా, రాష్ట్రంపై ఆధిపత్యం కోల్పోతున్నారు. ఇక ఆయన చేసిన రాజీనామాల సవాల్ కూడా నవ్వులపాలైంది. అమరావతిని రాజధానిగా కోరుకుంటున్న వాళ్ళు కూడా బాబు తన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీల చేత రాజీనామా చేయించొచ్చు కదా అనుకుంటున్నారు. ఆయన సవాల్ తరువాత ఎదో జరుగుతుందని బావించివారు కూడా తీవ్ర నిరాశకు గురవుతున్నారు. రాయలసీమ నేత బిటెక్ రవి చేత మండలి సభ్యత్వానికి రాజీనామా చేయించిన బాబు, రాయలసీమ ప్రజలు కూడా అమరావతికి అనుకూలం అని భ్రమింపచేసే ఆలోచన చేశారు. దాని వలన జరిగిన ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ. బిటెక్ రవి చేత రాజీనామా చేయించిన బాబు, కొడుకు లోకేష్ చేత కూడా చేయించొచ్చు కదా అని టీడీపీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. పదవులకు లోకేష్, త్యాగాలకు ఇతర నేతలా అని వాపోతున్నారు. మొత్తంగా రాజధాని ఉద్యమంలో టీడీపీ సర్వం కోపోతుంటే బాబు హైదరాబాద్ లో ఉంది చోద్యం చూస్తున్నాడు.