Chandrababu: జస్టిస్ చంద్రు కామెంట్స్ మీద చంద్ర‌బాబు క్లారిటీ.. అందుకే అలా అన్నార‌ట‌..!

Chandrababu: తమిళనాడుకు చెందిన రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రు జీవితం ఆధారంగా తెరకెక్కించిన ‘జై భీమ్’ చిత్రం భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో జస్టిస్ చంద్రు పాత్రలో హీరో సూర్య యాక్ట్ చేశారు. ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదలైన ఈ మూవీ దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది. అయితే, జస్టిస్ చంద్రు ఇటీవల ఏపీలోని విశాఖపట్టణంకు వచ్చారు. మానవ హక్కుల పరిరక్షణ దినోత్సవం రోజున నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ […]

Written By: Neelambaram, Updated On : December 15, 2021 6:12 pm
Follow us on

Chandrababu: తమిళనాడుకు చెందిన రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రు జీవితం ఆధారంగా తెరకెక్కించిన ‘జై భీమ్’ చిత్రం భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో జస్టిస్ చంద్రు పాత్రలో హీరో సూర్య యాక్ట్ చేశారు. ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదలైన ఈ మూవీ దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది. అయితే, జస్టిస్ చంద్రు ఇటీవల ఏపీలోని విశాఖపట్టణంకు వచ్చారు. మానవ హక్కుల పరిరక్షణ దినోత్సవం రోజున నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Chandrababu

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ హైకోర్టు పనితీరుపై కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. జస్టిస్ చంద్రు చేసిన కామెంట్స్ ఏపీలో అగ్గిరాజేశాయి. నేటికీ ఆ విషయంపై చర్చ నడుస్తూనే ఉంది. తాజాగా జస్టిస్ చంద్రు చేసిన కామెంట్స్ పై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలను వివరించే ప్రయత్నం చేశారు.

అయితే, జస్టిస్ చంద్రు చేసిన కామెంట్స్ పై ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ మిశ్రాతో పాటు జస్టిస్ దేవానంద్ కూడా సీరియస్ అయ్యారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వ్యకి ఇక్కడి పరిస్థితుల గురించి తెలుసుకోకుండా కామెంట్స్ చేయడం ఏంటని ఏపీ హైకోర్టు మండిపడింది. మానవ హక్కుల పరిరక్షణ కోసం వచ్చిన వ్యక్తులు వారి పని వారు చూసుకుంటే బాగుండేదని, పరిమితి దాటి మాట్లాడటం బాలేదని సూచించింది. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వలన ప్రజలకు కోర్టులు, న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులపై నమ్మకం పోతుందన్నారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు సుమోటోగా కేసు నమోదు చేయించే అధికారం తమకు ఉన్నప్పటికీ సమాజానికి మీరు చేసిన సేవలు, మీ సీనియార్టీని దృష్టిలో ఉంచుకుని అలా చేయడం లేదని ఏపీ హైకోర్టు తెలిపింది.

Also Read: Jagan: జ‌నంలోకి జ‌గ‌న్‌.. విశాఖ ప‌ర్య‌ట‌న‌పై అనేక ఊహాగానాలు..!

ఇకపోతే చంద్రబాబు జస్టిస్ చంద్రు వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వం నుంచి బెనిఫిట్ పొందేందుకు చేసినవిగా ఉన్నాయన్నారు. ఇక్కడి ప్రభుత్వం చేస్తున్న పాలన గురించి తెలియకుండా హైకోర్టును ఎలా తప్పుబడతారని ప్రశ్నించారు. గతంలో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తీ చలమేశ్వర్ తన కొడుక్కు వైసీపీ ప్రభుత్వం ద్వారా బెనిఫిట్ పొంది ఆయన జగన్ ప్రభుత్వాన్ని పొగిడారని గుర్తుచేశారు. జస్టిస్ చంద్రు కూడా వైసీపీ ప్రభుత్వం నుంచి పదవులు ఆశించి వెనకేసుకొస్తున్నారని ఫైర్ అయ్యారు. కాగా, చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై జస్టిస్ చంద్రు ఏవిధంగా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.

Also Read: Chandrababu: ఆ అస్త్రాన్ని వాడేసేందుకు చంద్ర‌బాబు రెడీ.. జ‌గ‌న్‌కు చిక్కులు..!

Tags