Aishwarya Rajesh: డస్కీ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ కి ఛాన్స్ లు కావాలనే ఆరాటం రోజురోజుకూ ఎక్కువ అవుతుంది. ఛాన్స్ లు అంటే.. ఏదో చిన్నాచితకా హీరోల చిత్రాల్లో అనుకున్నేరు ? కేవలం తాను స్టార్ హీరోల సినిమాల్లోనే నటించాలనే నియమం పెట్టుకుంటే ఎలా ఉంటుంది ? అని ఆలోచిస్తుంది ఐశ్వర్య రాజేష్. అప్పుడు ఒక్క ఛాన్స్ కూడా రాక, ఖాళీగా ఇంట్లో కూర్చోవాల్సి వస్తోంది అని ఐశ్వర్య రాజేష్ సన్నిహితులు ఆమె ముందే డైరెక్ట్ కామెంట్స్ చేస్తున్నారట.

సరే ఎవరు ఏమనుకున్నా తన ఆలోచనను మాత్రం మార్చుకోను అంటూ కలలు కంటూ ఉంది ఈ డస్కీ బ్యూటీ. ఎందుకు ఉన్నట్టు ఉండి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంటే.. తన కెరీర్ మరో మూడేళ్లు మాత్రమే ప్లాన్ చేసుకుందట. ఆ తర్వాత పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోవాలని, పెళ్లి తర్వాత, పిల్లలు పుట్టి.. వాళ్ళు పెద్ద అయ్యేవరకు మళ్ళీ సినిమాల వైపు చూడడు అట.
అందుకే చిన్న సినిమాలు చేస్తూ కూర్చుంటే మిగిలేది ఏమీ ఉండదు అని, అదే పెద్ద సినిమాలు చేస్తే.. కరెక్ట్ గా రెండేళ్లలోనే బాగా సంపాదించుకోవచ్చు అని ఐశ్వర్య రాజేష్ ఫీల్ అవుతుంది. ఈ క్రమంలోనే అందరికీ.. అంటే స్టార్ హీరోలకు, స్టార్ డైరెక్టర్లకు ఫోన్ చేసి మరీ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ చేస్తోంది.
Also Read: జీవితంలో మళ్లీ మళ్లీ చూడాలనిపించే చిత్రం ఇదే !
పెళ్లి చేసుకున్న తర్వాత మళ్లీ సినిమాలు చేయను అని, అందుకే దయచేసి ఇప్పుడే తనకు అవకాశాలు ఇవ్వండని మొత్తానికి ఐశ్వర్య రాజేష్ తన బాధను చెప్పుకుంటూ ఛాన్స్ లను అడుగుతుంది. కాకపోతే, ఛాన్స్ లే ఎంతవరకు వస్తాయి అనేది డౌట్. అమ్మడు అందగత్తె ఏమి కాదు. అందం లేదు కాబట్టి.. అందాలు ఆరబోసినా పెద్దగా డిమాండ్ ఉండదు.
అయితే, యాక్టింగ్ లో మంచి టాలెంట్ ఉంది. టాలెంట్ ఉన్నా గ్లామర్ లేనప్పుడు మన మాస్ హీరోలకు, మాస్ ప్రేక్షకులకు నచ్చదు. ఈ లెక్కన ఐశ్వర్య రాజేష్ కి పెద్ద ఛాన్స్ లు రావడం కష్టమే.
Also Read: Balayya: బాలయ్యకి ఎకౌంట్స్ లేకపోయినా సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు !