https://oktelugu.com/

పితాని కుమారుడి అరెస్టు తప్పదా?

ఇఎస్ఐ కుంభకోణంలో పశ్చిమ గోదవరి జిల్లాకు చెందిన టిడిపి నాయకులు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పితాని వెంకట సురేష్ అరెస్టు తప్పేలా కనిపించడం లేదు. అరెస్టుకు అవకాశం ఉందని ముందే గ్రహించిన పితాని వెంకట సురేష్, పితాని సత్యనారాయణ మాజీ పిఎస్ మురళీమోహన్ లు ముందే హైకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటీషన్ విచారణలో ఉండగానే కొద్ది రొజుల కిందట ఏసీబీ అధికారులు మురళీ మోహన్ ను అరెస్ట్ చేశారు. అదే […]

Written By: , Updated On : July 13, 2020 / 08:57 PM IST
Follow us on


ఇఎస్ఐ కుంభకోణంలో పశ్చిమ గోదవరి జిల్లాకు చెందిన టిడిపి నాయకులు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పితాని వెంకట సురేష్ అరెస్టు తప్పేలా కనిపించడం లేదు. అరెస్టుకు అవకాశం ఉందని ముందే గ్రహించిన పితాని వెంకట సురేష్, పితాని సత్యనారాయణ మాజీ పిఎస్ మురళీమోహన్ లు ముందే హైకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటీషన్ విచారణలో ఉండగానే కొద్ది రొజుల కిందట ఏసీబీ అధికారులు మురళీ మోహన్ ను అరెస్ట్ చేశారు. అదే సమయంలో పితాని వెంకట సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో ఆయన కోసం వెళ్లిన ఏసీబీ అధికారులు ఉత్తి చేతులతో వెనక్కి రాకతప్పలేదు.

నెక్స్ట్ మాజీ మంత్రి పితాని జైలుకెళ్లడం ఖాయమట..

మరోవైపు బెయిల్ పిటీషన్ పై హైకోర్టు ఈ రోజు విచారణ నిర్వహించింది. ఈ విచారణలో పితాని సురేష్ కు చుక్కెదురయ్యింది. ముందస్తు బెయిల్ కోసం సురేష్, మురళీమోహన్ లు పెట్టుకున్న పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. పిటిషనర్ల తరపున న్యాయవాధి చల్లా అజయ్ కుమార్ వాదనలు వినిపించారు. ఏసీబీ కేసుకు మూలకారణం రాజకీయ కక్ష సాధింపేనని వాధించారు. సురేష్, మురళీ మోహన్ లను కేసులో కావాలని ఇరికించారని అన్నారు. తన తండ్రి పదవిని వెంకట సురేష్ ఏనాడూ దుర్వినియోగం చేయలేదన్నారు. ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని న్యాయవాధి కోరారు. ఈ అభ్యర్థనతో ఏసీబీ తరపు న్యాయవాది విభేదించారు. ఈ కేసులో సురేష్ హస్తం ఉందనడానికి ఏసీబీ వద్ద ఆధారాలు ఉన్నాయని న్యాయమూర్తికి వివరించి ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని వాధనలు వినిపించారు. ఇరు వైపుల వాదనలను విన్న న్యాయమూర్తి ముందస్తు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించారు.

ఏసీబీ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు బెయిల్ పిటీషన్ పై ఆశలు పెట్టకున్న పితాని సురేష్ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తుందనే ఆశతో బెయిల్ వచ్చే వరకూ ఏసీబీకి చిక్కకుండా అజ్ఞాతంలో ఉంచడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బెయిల్ పిటీషన్ ను హైకోర్టు తిరస్కరించడంతో ఇప్పుడు పితాని సురేష్ అరెస్టు తప్పదా అనే విషయంపై టిడిపి నాయకుల్లో చర్చ జరుగుతుంది. న్యాయస్థానంలో మరో పిటీషన్ దాఖలు చేసే అంశంపై మాజీ మంత్రి పితాని ప్రముఖ న్యాయవాధులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

జగన్ పై తగ్గిన పవన్ విమర్శలు జోరు…కారణం?

ఇఎస్ఐ కేసులో ఇటీవల మాజీ మంత్రి పితాని సత్యనారాయణ చేసిన వాఖ్యలు కుంభకోణం జరిగిందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ‘రాజకీయాల్లో లాబీయింగ్ కామన్’ అంటూ ఆయన వాఖ్యానించారు. ఉన్నవిషయాన్ని నిర్మోహమాటంగా చెప్పే స్పభావం ఉన్న మాజీ మంత్రి పితాని స్వయంగా మీడియా ముందు ఈ వ్యాఖ్యలు చేయడంతో ఏసీబీ వాధనల్లో నిజం ఉందనే భావించవచ్చనే వాధనలు వినిపిస్తున్నాయి. 2017 ఏప్రిల్ 2న పితాని కార్మిక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి వరకూ కార్మికశాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు పని చేశారు. ఈ కేసులో అరెస్టయిన అచ్చెన్నాయుడు అనారోగ్య కారణాలతో గుంటూరులోని ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.