https://oktelugu.com/

జగన్ ముందు బాలయ్య డిమాండ్ల చిట్టా..!

ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి పదవీ చేపట్టి ఏడాదికాలం పూర్తయింది. కిందటి శాసనసభ ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఏడాదిలోనే జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల్లోకి దూసుకెళుతున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుగానీ ఆయన వియ్యంకుడైన బాలకృష్ణగానీ ఏనాడూ జగన్ చేసిన మంచిపనులను ప్రశంసించిన మచ్చుకైనా కన్పించిన సందర్భాలేవనే చెప్పొచ్చు. దీనికితోడు బాలకృష్ణ ఇటీవల ఓ ఇంటర్య్యూలో సీఎం జగన్మోహన్ పాలనపై స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వం ప్రజా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 13, 2020 8:39 pm
    Follow us on


    ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి పదవీ చేపట్టి ఏడాదికాలం పూర్తయింది. కిందటి శాసనసభ ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఏడాదిలోనే జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల్లోకి దూసుకెళుతున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుగానీ ఆయన వియ్యంకుడైన బాలకృష్ణగానీ ఏనాడూ జగన్ చేసిన మంచిపనులను ప్రశంసించిన మచ్చుకైనా కన్పించిన సందర్భాలేవనే చెప్పొచ్చు. దీనికితోడు బాలకృష్ణ ఇటీవల ఓ ఇంటర్య్యూలో సీఎం జగన్మోహన్ పాలనపై స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తుందని.. త్వరలోనే జగన్ ప్రభుత్వం పడిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వానికి సమస్యలు..

    తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డికి బాలకృష్ణ లేఖరాయడం చర్చనీయాంశంగా మారింది. బాలకృష్ణ ఫ్యాక్స్ ద్వారా సీఎం కార్యాలయానికి లేఖను పంపించారు. జగన్ ముందు రెండు డిమాండ్లను పెట్టారు. ముఖ్యంగా జిల్లాల పునర్విభజన అంశంపై బాలయ్య లేఖను రాసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నియోజకవర్గాల ప్రతిపాదికన కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరారు. అలాగే హిందుపూర్ పార్లమెంట్ నియోజకవర్గానికి మంజూరైన మెడికల్ కళాశాలను హిందుపూర్ సమీపంలోని మలుగూరు వద్ద ఏర్పాటు చేయాలని బాలయ్య ఆ లేఖలో కోరారు.

    ఎన్నికల మెనిఫోస్టోలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ప్రతీ నియోజకవర్గాన్ని జిల్లా చేస్తానంటూ గతంలో హామీ ఇచ్చారు. ఈమేరకు ఏపీలో ఉన్న 13జిల్లాలను 25జిల్లాలుగా మార్చేందుకు జగన్ సర్కార్ ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ప్రభుత్వం నిర్ణయంపై ఇప్పటికే పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు కొత్త జిల్లాల ప్రతిపాదనను స్వాగతిస్తుందని మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలను విభజించొద్దని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ప్రభుత్వానికి వచ్చిన ప్రతిపాదనలకు అనుగుణంగా సీఎం జగన్ ఈనెల 15న జరిగే క్యాబినెట్లో మీటింగులో నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.

    జగన్ పట్టుదల.. టెక్ దిగ్గజం ఏపీకి..

    జిల్లాల ఏర్పాటుకే ప్రభుత్వం మొగ్గుచూపుతుండగా ప్రభుత్వం యంత్రాంగం ఈమేరకు తగిన ప్రణాళికలను సీఎం ముందు ఉంచినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటుచేసే జిల్లాలకు తోడు మరో 12జిల్లాల పేర్లు తెరపైకి రావడంతో సాధ్యసాధ్యాలు, అదనపు భారంపై ఇప్పటికే అధికారులు పలుసార్లు సమీక్షించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కొత్త జిల్లాల లిస్టులో హిందూపురాన్ని చేర్చాలంటూ డిమాండ్ చేస్తూ లేఖరాశారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే బాలకృష్ణ సీఎం జగన్ కు లేఖరాసినట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం కూలిపోతుందని వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ డిమాండ్లను సీఎం జగన్ ఏమేరకు నెరవేరుస్తారో వేచి చూడాల్సిందే..!