ముద్రగడ.. కాపులు.. ఓ కుట్రకోణం!

రెడ్డి సామాజికవర్గానికి సీఎం జగన్ ఉన్నారు.. కమ్మలకు బలమైన చంద్రబాబున్నారు. కానీ కాపులకు ఎవరున్నారు..? బలంగా ఎవరు నిలబడుతున్నారు అంటే చెప్పడం కొంచెం కష్టమే.. జగన్, చంద్రబాబులాగా బలమైన నేతలు కాపు సామాజిక వర్గానికి లేరన్నది ఆ సమాజం అంగీకరించాల్సిన వాస్తవం.. పవన్ కళ్యాణ్ తెరమీదకు వచ్చినా ఆయన కాపులకు నాయకుడిని అని ఎక్కడా చెప్పుకోడు. పార్ట్ టైం పాలిటిక్స్ తో పవన్ కాపుల కోసం చేసింది ఇప్పటివరకు చాలా తక్కువంటారు. ఇక కాపుల రిజర్వేషన్ల కోసం […]

Written By: admin, Updated On : July 14, 2020 11:03 am
Follow us on

రెడ్డి సామాజికవర్గానికి సీఎం జగన్ ఉన్నారు.. కమ్మలకు బలమైన చంద్రబాబున్నారు. కానీ కాపులకు ఎవరున్నారు..? బలంగా ఎవరు నిలబడుతున్నారు అంటే చెప్పడం కొంచెం కష్టమే.. జగన్, చంద్రబాబులాగా బలమైన నేతలు కాపు సామాజిక వర్గానికి లేరన్నది ఆ సమాజం అంగీకరించాల్సిన వాస్తవం.. పవన్ కళ్యాణ్ తెరమీదకు వచ్చినా ఆయన కాపులకు నాయకుడిని అని ఎక్కడా చెప్పుకోడు. పార్ట్ టైం పాలిటిక్స్ తో పవన్ కాపుల కోసం చేసింది ఇప్పటివరకు చాలా తక్కువంటారు. ఇక కాపుల రిజర్వేషన్ల కోసం చాలా ఏళ్లుగా ఉద్యమిస్తున్నారు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. ఆయన ఏ పార్టీలోనూ లేరు. అలాంటి నేత అప్పుడో ఇప్పుడో కాపుల కోసం ఈ వయసు మీద పడ్డ తరుణంలోనూ ఉద్యమిస్తున్నారు. కానీ కాపుల్లో అనైక్యత.. కాపు నేతలకు టీడీపీ, వైసీపీ పదవుల పందేరంతో ఆయనకు మద్దతు కరువవుతోంది.ఈ క్రమంలోనే కాపులకు రిజర్వేషన్లపై ఇటీవలే జగన్ కు బహిరంగ లేఖ రాశారు ముద్రగడ.. కాపుల రిజర్వేషన్లపై ప్రధాని మోడీతో చర్చించాలని జగన్ ను కోరారు.అయితే టీడీపీతో ఫైట్ చేసినట్టు ఆయన జగన్ తో ఫైట్ చేయడం లేదని కొందరు టీడీపీలో వున్న  కాపు నేతలే ఆరోపించడం గమనార్హం.

కాపుల్లోనే అనైక్యత సృష్టిస్తూ ఉద్యమాన్ని నీరుగారుస్తున్న వైనంపై ముద్రగడ మనస్థాపం చెందారు. తాజాగా కాపు ఉద్యమం నుంచి తప్పుకోబోతున్నానని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఈ మేరకు బహిరంగ ప్రకటనను ముద్రగడ ఈరోజు విడుదల చేశారు.ముద్రగడ ఆ లేఖలో కాపుల్లోని నేతలే తనను టార్గెట్ చేయడంపై మనస్థాపం చెందారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తనపై కొందరు పెద్దలు దుష్ర్పచారం చేయిస్తున్నారని.. తనను కాపు ద్రోహిగా గజ దొంగగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ముద్రగడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనపై మీడియా, సోషల్ మీడియాలో ఎందుకు మానసికదాడులు చేస్తున్నారో అర్థం కావడం లేదని వాపోయారు. ఉద్యమం చేసిన కాలంలో ఆర్థికంగా రాజకీయంగా నష్టపోయానని.. ఏనాడు చింతించలేదని.. కాపు ద్రోహిగా చిత్రీకరించడం కలిచివేసిందన్నారు. కాపు రిజర్వేషన్లు సాధించడమే తన అంతిమ ఆశయమని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు.ముద్రగడ లేఖ ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.

ఇప్పుడు ఆ కాపునేతలు ఏం సమాధానం చెబుతారు..?

కాపుల్లోని అనైక్యతను, కాపు ఉద్యమాన్ని నీరుగార్చే కుట్రగా కాపు నేతలు అభివర్ణిస్తున్నారు. ముద్రగడపై విష ప్రచారం వెనుక జనసేన పార్టీలోని ఒక ఆడిటర్ ఉన్నాడని సదురు నేతలు ఆరోపిస్తున్నారు. జనసేన పార్టీలో ఈయన కీరోల్ పోషిస్తుంటారని.. అతడి ద్వారా టీడీపీ డైరెక్షన్ లోనే ముద్రగడను నీరుగార్చాలని.. ఆయనను కాపు ఉద్యమం నుంచి పక్కకు తప్పించాలనే కుట్ర జరిగిందని ఆరోపిస్తున్నారు.

సదురు ఆడిటర్ తన చేతికి మట్టి అంటకుండా  తెరవెనుక ఈ కుట్ర చేసినట్టు కాపు నేతలు అనుమానిస్తున్నారు. తన చుట్టమైన ఒక కీలక వ్యక్తిని టీవీ డిబేట్లలో కూర్చుండబెట్టి.. ‘పద్మనాభం అసలు కాపు ఉద్యమ నాయకుడే కాదని.. ఆయన రాజకీయ నాయకుడని.. చంద్రబాబుపై వ్యక్తిగత వైరాల వల్ల ఉద్యమం చేశాడని’ ముద్రగడపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. కాపులను చీల్చే కుట్ర ఇందులో స్పష్టంగా కనిపిస్తోందని ముద్రగడ మద్దతుదారులు అనుమానిస్తున్నారు.

Source: Whatsapp Note: ఈ వీడియో మీద ఏమైనా అభ్యంతరాలు వుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు.

ఇక ఇదే జనసేన పార్టీకి చెందిక కీలకనేతకు చెందిన న్యూస్ చానెల్ లో జనసేనాని రాసిన లెటర్ ని హైలైట్ చేస్తూ సొంత కుల నాయకుడైన ముద్రగడను తక్కువ చేసి చూపిస్తు ముద్రగడ ఈ మాత్రమైన స్పందించారు అంటే అది పవన్ కళ్యాణ్ చలువే అంటూ మాట్లాడటం, ముద్రగడ కలసిరావడం లేదంటూ  మరియు రాజశేఖర్ రెడ్డి పూజ్యులు ఎలా అయ్యారు, జగన్ దానకర్ణుడు ఎలా అయ్యదంటు ప్రశ్నించడం చాలా మంది కాపులకు రుచించలేదు.

సోర్స్: https://youtu.be/4hbOccagv8E

తర్వాత చాలామంది జనసైనికులు ముద్రగడను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇదే విషయాన్ని పద్మనాభంతో చాలా మంది షేర్ చేసుకున్నారు. దీంతో ఈ పరిణామాలతో మనస్థాపం చెందిన ముద్రగడ ఎన్నో ఏళ్ల నుంచి పోరాడుతున్న కాపు ఉద్యమకాడిని వదిలేశారు. దీనంతటికి కారణం జనసేనలోని కొద్దరు వ్యక్తులే అంటున్నారు. ఒక కాపుల పార్టీ అయిన జనసేన ముద్రగడ విషయంలో ఇలా ప్రవర్తించడం మంచిది కాదనే ఆవేదన కాపు నేతల్లో వ్యక్తమవుతోంది.

దీనికి ప్రధాన కారణం ఏంటంటే.. బీజేపీ కేంద్ర, రాష్ట్ర నేతలు ఎవరు వచ్చినా కాపు ఉద్యమ సేనాని అయిన ముద్రగడ చుట్టే తిరుగుతున్నారు కాని ప్రజల మద్యలేకుండా, కార్యకర్తలను పట్టించుకోవటం లేదు అనే విమర్శలను ఎదుర్కుంటున్న, హైదరాబాద్ లో ఉంటున్న పవన్ కళ్యాణ్ కోసం చూడడం లేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నారు. అయినా కూడా బీజేపీలోని కొంత  క్యాడర్ పవన్ పై కొంత అపనమ్మకంతో టిడిపి కి ఇంకా దగ్గరగా వున్నారేమో అనే అనుమానం బలంగా ఉండటంతో జనసేనతో కలవడానికి ఇష్టపడడం లేదు. పవన్ కళ్యాణ్ ఎంతసేపు టీడీపీ ఫేవర్ గా రాజకీయాలు చేస్తున్నారనే అపవాదును మూటగట్టుకున్నారు. అందుకే బీజేపీలో ఉన్న  ఒక వర్గం మొత్తం కూడా పవన్ ను కాపుల నేతగా గుర్తించడం లేదు. ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అందువల్ల కాపులంతా ముద్రగడ చుట్టు తిరుగుతున్నారనే అక్కసుతోనే జనసేన నేతలు ఆయనను టార్గెట్ చేశారని కొంతమంది ఆరోపిస్తున్నారు. ముద్రగడను కాపుల నుంచి దూరం చేస్తే వారి క్రెడిట్ మొత్తం జనసేన పవన్ కళ్యాణ్ కు షిఫ్ట్ అవుతుందనే ఈ కుట్ర చేశారని అంటున్నారు.

‘విభజన’తో టీడీపీకీ జగన్ స్కెచ్..!

ఇలా ముద్రగడ పద్మనాభం కాపుల ఉద్యమంలో ఉంటే ఎప్పటికీ తమకు క్రెడిట్.. ఆధిపత్యం రాదనే కుట్రతోనే .. వారి అనుకూల మీడియా, సోషల్ మీడియాలో ముద్రగడను టార్గెట్ చేశారని అంటున్నారు. ఆయనను కించపరిచేలా అవమానించడం ప్రారంభించాయి. ఇవన్ని ఆయనను కాపు ఉద్యమం నుంచి వైదొలిగేలా చేస్తున్నాయి. ఈ మొత్తం కుట్రలో కొందరు జనసేన నేతలు కీలక పాత్రధారులని.. కాపుల ఉద్యమాన్ని కాపు నేతలే స్వార్థం కోసం నీరుగారుస్తున్నారనే అనుమానాలు ఆ వర్గం నేతల్లో వ్యక్తమవుతున్నాయి.

జనసేన నేతలు, కొద్దిమంది కాపు నాయకులు  కాపులకు మంచి చేయకపోగా.. ఉద్యమించేవారిని సైతం విరమించుకునేలా ద్రోహం చేయడంపై కాపులు రగిలిపోతున్నారు. కాపుల కోసం ముద్రగడ ఎంతో చేశారు. దెబ్బలు తిన్నారు. జైలుకెళ్లారు. కాపు రిజర్వేషన్ల కోసం దశాబ్ధాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. అలాంటి ఆయనను ఈ కాపు ఉద్యమం నుంచి పక్కకు తప్పించే కుట్ర తాజాగా జరుగుతోంది. స్వార్థం కోసం కాపు ఉద్యమాన్ని నీరుగారుస్తూ హైజాక్ చేసి కాపులను బానిసలుగా మార్చే కుట్ర తెరవెనుక నడిపిస్తున్నారు. సొంత అస్తిత్వం కోసం కాపులు పోరాడకుండా పార్టీల కింద నలిగిపోయేలా చేసే ఆ  కుట్రదారుల వలలో ఎవరూ చిక్కుకోవద్దని కాపు నేతలు కోరుతున్నారు. ముద్రగడను కాపు ఉద్యమం నుంచి పక్కకు పోవద్దని విన్నవిస్తున్నారు.

ఎన్నం