Central Government: కేంద్ర ప్రభుత్వం సౌత్ ఇండియాను పట్టించుకోవడం లేదని మరోసారి రుజువైంది. దేశానికి ఇండిపెండెన్స్ వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వాతంత్ర్య స్పూర్తికి అద్ధం పట్టేలా రిపబ్లిక్ డే వేడుకలకు శకటాలను తయారు చేయాలని కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. అయితే, దక్షిణాది నుంచి తయారైన శకటాల ప్రదర్శనకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. అందకు గల కారణాలను కూడా బహిర్గతం చేయలేదు. తిరస్కరణకు గురైన శకటాల లిస్టులో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడుతో పాటు ఈశాన్యం నుంచి పశ్చిమ బెంగాల్ శకటం కూడా ఉంది. కేంద్రం తీరుతో ఆగ్రహానికి గురైన రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేరుగా ప్రధాని మోడీకి లేఖలు రాసినట్టు తెలుస్తోంది.

ఏపీ ప్రభుత్వం జాతీయ పతాక రూపకర్త, తెలుగువాడైన పింగళి వెంకయ్య శకటాన్ని తయారు చేయించింది. అయితే, ఈ శకటాన్ని కేంద్రం తిరస్కరించింది. అదేవిధంగా తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రానికి చెందిన తొలి స్వతంత్ర సమరయోధురాలు వేలునాచయ్యర్, ప్రముఖ కవి భారతీయార్ స్ఫూర్తితో రూపొందించిన శకటాలను నాలుగు రిహార్సిల్స్ తరువాత తిరస్కరిస్తున్నట్లు కేంద్రం నుంచి సమాచారం అందింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం చేసింది. సీఎం స్టాలిన్ ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి వెంటనే లేఖను కూడా రాశారు.
Also Read: చిరంజీవితో మాట్లాడా.. జగన్‌కు కృతజ్ఞతలు – నాగార్జున
ఇకపోతే నేతాజీ సుభాష్ చంద్ర బోస్ 125వ జయంతిని పురస్కరించుకుని ఈనెల 23వ నుంచే గణతంత్ర వేడుకలు నిర్వహిస్తామని కేంద్రం ప్రకటించడంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నేతాజీ శకటాన్ని రూపొందించగా దానికి కూడా కేంద్రం తిరస్కరించింది. ఈ విషయంపై సీఎం మమతాబెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ప్రధాని మోడీకి లేఖ రాశారు. బెంగాల్ ప్రజలను అవమానపరిచారంటూ ఫైర్ అయ్యారు. జర్మనీలో ఉండే నేతాజీ కుమార్తె అనితా బోస్ కూడా ఈ వ్యవహారంపై ఘాటుగానే స్పందించారు. బోసు శకటం తిరస్కరణ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
స్వాతంత్ర్యం స్పూర్తితో రూపొందించిన శకటాలను తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వం కాశీ విశ్వనాథ్ ఆలయ నమూనాతో తయారు చేసిన ఉత్తరప్రదేశ్ శకటానికి అనుమతి ఇచ్చింది. అరుణాచల్‌ప్రదేశ్, హర్యానా, గుజరాత్, కర్ణాటక, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మేఘాలయ, జమ్ముకాశ్మీర్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్ రాష్ట్రాల శకటాలకు కూడా అనుమతి ఇచ్చింది. వీటిలో అధికభాగం బీజేపీ పాలిత రాష్ట్రాలే ఉండటం గమనార్హం. సౌత్‌లో కర్ణాటకకు మినహా మిగతా నాలుగు రాష్ట్రాలకు కూడా కేంద్ర రిక్త హస్తం చూపించింది. కేరళ రాష్ట్రం తరఫున నారాయణ గురు శకటాన్ని ప్రదర్శిస్తామంటూ సీఎం పినరయి చేసిన ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించగా అక్కడి ప్రజలు, కమ్యూనిస్టు ప్రభుత్వం సెంట్రల్ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎటువంటి చర్యలకు దిగుతారో వేచిచూడాల్సిందే.
Also Read: హీరోయిన్ తో వరుణ్ తేజ్ ప్రేమ పెళ్లి ?