spot_img
Homeజాతీయ వార్తలుదీదీపై కేంద్రం సీబీఐ అస్త్రం

దీదీపై కేంద్రం సీబీఐ అస్త్రం

Mamata
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఈసారి పశ్చిమబెంగాల్‌ ఎన్నికలను పూర్తిస్థాయిలో టార్గెట్‌ చేసింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ సారి పశ్చిమ బెంగాల్‌లో కాషాయం జెండా ఎగురవేయాలని దృఢ సంకల్పంతో ఉంది. నాలుగైదేళ్ల కాలంలో అనేక కేసులతో తృణమూల్ కాంగ్రెస్ నేతల్ని భయపెట్టిన సీబీఐ.. ఎన్నికల ముందు వచ్చే సరికి.. వారందర్నీ బీజేపీలో చేరేలా చేయడంలో సక్సెస్ అయింది. శారదా చిట్స్ సహా అనేకానేక కేసుల్లో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న వారు ఇప్పుడు కమలం నీడలో సేదతీరుతున్నారు. వారి విషయంలో బీజేపీ యూటర్న్ తీసుకుంది.

Also Read: ఏపీలో పంచాయతీ పోరు సక్సెస్..‘నిమ్మగడ్డ’ గెలిచినట్లేనా..?

అందుకే ఇప్పుడు సీబీఐ మాత్రం ఆగడం లేదు. బీజేపీలో చేరిన వారిని వదిలేసి.. ఇతర టార్గెట్లపై దృష్టి పెట్టింది. తాజాగా మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో పాటు ఆయన భార్యకు నోటీసులు జారీ చేసింది. కోల్‌కతాలోని అభిషేక్‌ బెనర్జీ ఇంటికి వెళ్లిన సీబీఐ బృందం, కోల్‌ స్కామ్‌ కేసులో దర్యాప్తుకు సహకరించాలని ఆయన భార్య రుజిరా బెనర్జీకి నోటీసులు ఇచ్చింది. ముందుగానే ఆమెకు సమన్లు జారీ చేసి సీబీఐ ఆఫీసుకు పిలిపిస్తారన్న ప్రచారం జరుగుతోంది.

బొగ్గు గనుల్లో అవకతవకలు జరిగాయని మూడు నెలల కిందటే సీబీఐ కేసు నమోదు చేసి తృణమూల్ నేతలపై గురి పెట్టింది. తమను భయపెట్టడానికి బీజేపీ సీబీఐని వాడుకుంటుంటోందని మండిపడుతోంది. ఇప్పటికే సీబీఐని బీజేపీ మిత్రపక్షంగా విపక్ష పార్టీలు సెటైర్లు వేస్తుంటాయి. రెండు రోజుల కిందట అభిషేక్ బెనర్జీ .. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై దాఖలు చేసిన ఓ పరువు నష్టం కేసులో హాజరు కావాలని కోర్టు షాను ఆదేశించింది.

Also Read: ఏపీ పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. కొత్త పద్ధతిలో పరీక్షలు..?

అయితే.. ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేశారని అభిషేక్ బెనర్జీ అమిత్ షాపై పిటిషన్ వేశారు. బెంగాల్‌లోని ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు అమిత్ షాకు సమన్లు చేసిన మరుసటి రోజే సీబీఐ అభిషేక్ బెనర్జీకి నోటీసులు జారీ చేసింది. ఇదే క్రమంలో ఇప్పుడు సీబీఐని పావుగా వాడుతోంది బీజేపీ. దేశంలో ఎక్కడ గెలవాలనుకుంటే అక్కడ బీజేపీ ముందుగా సీబీఐని పంపుతోంది. అక్కడ ఉన్న పార్టీలను.. నేతలపై సీబీఐ రెయిడ్ చేస్తోంది. దాంతో వారు బీజేపీలో చేరిపోతున్నారు. ఫలితంగా బీజేపీ బలం పుంజుకుంటోంది. వారు చేసిన నేరాలన్నీ మరుగున పడిపోతున్నాయి. ఇలా ఏపీ నుంచి బెంగాల్‌ వరకూ ఇదే రాజకీయం నడుస్తోంది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Oktelugu Epaper
Exit mobile version