ఏపీలో పంచాయతీ పోరు సక్సెస్..‘నిమ్మగడ్డ’ గెలిచినట్లేనా..?

ఆంధ్రప్రదేశ్లో మొత్తానికి పంచాయతీ పోరు ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగానే ఎన్నికలు ముగిశాయి. కరోనా ఉధృతి కాలంలో ఎన్నికలేంటని ప్రభుత్వం ఈ ప్రక్రియ రద్దు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎలక్షన్ కమిషన్ పట్టుబట్టి మరీ పోలింగ్ నిర్వహించింది. ఒకనోక దశలో ఉద్యోగ సంఘాలు సైతం సహకరించమని భీష్మించుకు కూర్చున్నారు. కానీ కోర్టులను నమ్ముకున్న ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మొత్తానికి ఏపీలో పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగానే నిర్వహించారన్న టాక్ వినిపిస్తోంది. గత సంవత్సంర […]

Written By: NARESH, Updated On : February 22, 2021 1:03 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్లో మొత్తానికి పంచాయతీ పోరు ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగానే ఎన్నికలు ముగిశాయి. కరోనా ఉధృతి కాలంలో ఎన్నికలేంటని ప్రభుత్వం ఈ ప్రక్రియ రద్దు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎలక్షన్ కమిషన్ పట్టుబట్టి మరీ పోలింగ్ నిర్వహించింది. ఒకనోక దశలో ఉద్యోగ సంఘాలు సైతం సహకరించమని భీష్మించుకు కూర్చున్నారు. కానీ కోర్టులను నమ్ముకున్న ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మొత్తానికి ఏపీలో పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగానే నిర్వహించారన్న టాక్ వినిపిస్తోంది.

గత సంవత్సంర మార్చిలో జగన్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ కు సూచించింది. అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ ఎన్నికలను వాయిదా వేశారు. సంవత్సరం కాలం గడిచిన తరువాత ఎలక్షన్ కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికలను కాదని పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే కరోనా ఉధృతి ఇంకా తగ్గనందున..గ్రామాల్లో కరోనా కేసులు పెరుగుతున్నందున ఇప్పుడు ఎన్నికలు వద్దని ప్రభుత్వం తెలిపింది. ఈ వ్యవహారం ముదరడంతో కోర్టుల దాకా వెళ్లింది. చివరికి సుప్రీం కోర్టు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్రంలో నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలను పూర్తి చేశారు.

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా నాలుగు దశల్లో 13,097 గ్రామాలకు పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఇందులో 16 శాతం పంచాయతీలు మాత్రమే ఏకగ్రీవమయ్యాయి. ప్రభుత్వం పంచాయతీలను ఏకగ్రీవం చేసేందుకు ఎన్నో ప్రోత్సాహకాలు ప్రకటించినా ప్రజలు పట్టించుకోలేదు. మరోవైపు ఎన్నికల ద్వారానే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ చేసిన ప్రచారం జనాల్లోకి వెళ్లింది.

ఇక పోలింగ్ విషయంలోనూ ఎలక్షన్ కమిషన్ ఊహించిన విధంగానే సాగింది. గ్రామాల్లో ఏవేవో గొడవలు, వివాదాలు జరుగుతాయనుకున్నా.. కొన్నిచోట్ల మినహాయించి మొత్తంగా పోలింగ్ ప్రక్రియ సజావుగానే సాగింది. మొత్తంగా 80 శాతం ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటెసేందుకు తమ పనులను పక్కనబెట్టి భారీగా క్యూ లైన్లలో నిల్చున్నారు.

కరోనా నేపథ్యంలో ఉద్యోగులు నష్టపోతారని, వారికి వ్యాక్సిన్లు ఇచ్చిన తరువాతే ఎన్నికలు నిర్వహించాలని కొన్ని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. కానీ సుప్రీం తీర్పు వచ్చాక ఉద్యోగులంతా పోలింగ్ కుసహకరించారు. ఫ్రంట్ లైన్ వర్కర్ గా ఉన్న పోలీసులు సైతం వ్యాక్సిన్ వేసుకుంటూ విధుల్లో పాల్గొనడం విశేషం. ఇదిలా ఉండగా మొదటి నుంచి నిమ్మగడ్డ వర్సెస్ జగన్ అన్నట్లు సాగితే.. తాజాగా ఎలక్షన్ కమిషనర్ పై చంద్రబాబు ఫైర్ అవుతున్నాడు. ఎన్నికల సమయంలో కొన్ని కమిషనర్ పనితీరుపై బాబు పెదవి విరిచారు. ఏదీ ఎలా ఉన్నా నిమ్మగడ్డ మాత్రం తాను అనుకున్నట్లు ఎన్నికలు నిర్వహించి నైతికంగా విజయం సాధించారనుకోవచ్చు.