https://oktelugu.com/

మన ఇంట్లో సిరిసంపదలు కలగాలంటే ఈ మార్పులు చేయాల్సిందే..!

ప్రతి ఒక్కరు వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలగాలని భావిస్తారు. అందుకోసం మన ఇంట్లో ఎన్నో రకాల పూజలను వ్రతాలను నిర్వహిస్తుంటారు. సిరిసంపదలు కలగాలంటే ముఖ్యంగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి.అలాంటప్పుడు ఆ లక్ష్మి దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అదే విధంగా కొన్ని రకాల వస్తువులను మన ఇంట్లో ఉంచడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల వాతావరణం తొలిగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడటం వల్ల మన ఇంట్లో సుఖ సంతోషాలు వస్తాయని పండితులు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 22, 2021 / 01:21 PM IST
    Follow us on

    ప్రతి ఒక్కరు వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలగాలని భావిస్తారు. అందుకోసం మన ఇంట్లో ఎన్నో రకాల పూజలను వ్రతాలను నిర్వహిస్తుంటారు. సిరిసంపదలు కలగాలంటే ముఖ్యంగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి.అలాంటప్పుడు ఆ లక్ష్మి దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అదే విధంగా కొన్ని రకాల వస్తువులను మన ఇంట్లో ఉంచడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల వాతావరణం తొలిగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడటం వల్ల మన ఇంట్లో సుఖ సంతోషాలు వస్తాయని పండితులు చెబుతున్నారు.అయితే మన ఇంట్లో సిరి సంపదలు కలగాలంటే ఏ విధమైన మార్పులు చేసుకోవాలి, ఎలాంటి బొమ్మలను ఇంట్లో పెట్టుకోవాలి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం….

    మన ఇంట్లో ఎల్లవేళలా శుభం కలగాలంటే కచ్చితంగా ఏనుగు బొమ్మలు, గోమాత బొమ్మలు తప్పనిసరిగా మన ఇంట్లో ఉండాలి. మన ఇంట్లో ముఖద్వారం దగ్గర ఏనుగు తొండం పైకి ఎత్తి ఉండే విగ్రహాలు పెట్టడం వల్ల మన ఇంట్లో ఎల్లప్పుడు శుభ పరిణామాలు జరుగుతాయి. అయితే ఏనుగు చూపులు ఇంటి గుమ్మం వైపు కాకుండా కొద్దిగా పక్కకు ఉండేవిధంగా పెట్టడం వల్ల మన ఇంట్లోకి అదృష్ట లక్ష్మి వస్తుందని పండితులు చెబుతున్నారు.

    హిందూ శాస్త్రం ప్రకారం గోవులో సకల దేవతలు కొలువై ఉంటారని చెబుతారు. అందుకోసమే గోవును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఇంతటి పవిత్రమైన గోమాత విగ్రహం మన ఇంట్లో ఉండడం వల్ల సకల దేవతల ఆశీర్వాదం మనపై ఉంటుంది. అయితే కేవలం ఆవు మాత్రమే కాకుండా దూడతో పాటు కలిసి ఉన్న విగ్రహాన్ని ఉత్తరం వైపు పెట్టడం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఏనుగు బొమ్మను ఇంట్లో పెట్టేటప్పుడు ఈ మంత్రాన్ని చదివి పెట్టడం వల్ల ఎన్నో ఫలితాలు పొందవచ్చు. ‘ నమః సర్వనివాసాయ సర్వశక్తియుతాయచ మహాబీష్టం కురుష్వాశు శరణాగతవత్సలా’ అనే మంత్రాన్ని చదవాలి.