spot_img
Homeఅంతర్జాతీయంPakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం లేదు. పాకిస్థాన్ దిగజారి పోవడం కొత్త కాకపోయినప్పటికీ. ఈ స్థాయిలో బిచ్చం ఎత్తుకొని స్థాయికి ఆ దేశ ఆర్థిక పరిస్థితి దిగజారడం అక్కడి ప్రజలలో ఆందోళన కలిగిస్తోంది.

ఇటీవల అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధాన్ని తగ్గించడానికి.. శాంతి వాతావరణం నెలకొల్పడానికి దాయాది దేశం మధ్యవర్తి పాత్ర పోషించింది. అయితే రెండుసార్లు చర్చలు జరిగినప్పటికీ.. శాంతి కాదు కదా.. కనీసం కాల్పుల విరమణ ఒప్పందం కూడా జరగలేదు. రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పి.. అంతర్జాతీయంగా పోయిన పరువును కాపాడుకోవాలని పాకిస్థాన్ అనుకుంది. కానీ పాకిస్థాన్ అనుకున్నట్టుగా ఏదీ జరగలేదు. పైగా నాడు శాంతి చర్చలకు ఆతిథ్యం ఇచ్చిన హోటల్ బిల్లు కూడా పాకిస్తాన్ ప్రభుత్వం కట్టలేదని వార్తలు వచ్చాయి.

నాడు శాంతి చర్చలకు సంబంధించిన ఖర్చు మొత్తం ఆఘా ఖాన్ ఫౌండేషన్ భరిచ్చినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ కనీసం చర్చకు సంబంధించిన ఖర్చు కూడా పెట్టుకునే స్థితిలో లేకపోవడంతో.. ఆ ఫౌండేషన్ ముందుకు వచ్చినట్టు సమాచారం. పైగా ఇప్పుడు పాకిస్తాన్లో పైసా కూడా ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశం లేదు.. అక్కడ మిలిటరీకి మాత్రమే జీతాలు ఇస్తున్నారు. మిగతా విభాగాలలో కోతలు విధిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఇప్పుడిక పాకిస్తాన్ నడిబజార్లలో బిచ్చగాళ్ళ మాదిరిగా యాచించడం మొదలుపెట్టింది.

ఇటీవల అమెరికా, ఇరాన్ దేశాల మధ్య చర్చలకు తాము ప్రాతినిధ్యం వహించామని చెప్పుకుంటున్న పాకిస్తాన్.. ఇప్పుడు ఏకంగా అమెరికాను బిచ్చం ఎత్తుకుంటున్నది. అమెరికాను 10 బిలియన్ డాలర్ల బైలటేరియల్ ఎక్స్చేంజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఫండ్ ఇవ్వాలని అడుగుతున్నది. ఇటీవల ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న చర్చలకు తాము సమన్వయం వహించామని.. అందువల్లే ఈ డబ్బులు కావాలని పాకిస్తాన్ అడుగుతున్నది. వాస్తవ పరిస్థితి ప్రకారం చూసుకుంటే ఇరాన్, అమెరికా మధ్య చర్చలు ఇంతవరకు సఫలం కాలేదు. ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటప్పుడు ఈ ఫండ్ ను అమెరికా ఎలా ఇస్తుందో పాకిస్తాన్ కే తెలియాలి. మరోవైపు పాకిస్తాన్ ప్రభుత్వం డబ్బుల కోసమే విదేశాలలో పర్యటిస్తోంది. ఇతర దేశాల నుంచి అప్పులు ఆశిస్తోంది. అందువల్లే ఆ దేశం దివాలా అంచులో మిగిలిపోయింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Chiranjeevi: చిరంజీవి కెరియర్ లో చేసిన మూడు తప్పులు ఇవే…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒక సామాన్య మానవుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా మారవచ్చు అని ప్రూవ్ చేసిన...

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ వెనక ఇన్ని కారణాలున్నాయి…

Vijay Deverakonda: 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ... ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా...

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
Oktelugu Epaper
Exit mobile version