spot_img
Homeజాతీయ వార్తలుSonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్ పేపర్ లీకేజ్ వల్ల చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు చొప్పున పరిహారం ఇవ్వాలని.. ఇలా అనేక రకాల డిమాండ్లతో సోనం నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఆయన ఏకంగా జంతర్ మంతర్ వద్ద తన దీక్షను కొనసాగించారు.. ఆ తర్వాత ప్రభుత్వం ఆయనను అదుపులోకి తీసుకుంది. ఆసుపత్రికి తరలించింది. ఆసుపత్రిలో కూడా సోనం దీక్షను కొనసాగించారు.

సోనం ఆస్పత్రిలో ఉండడం.. కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు సోషల్ మీడియా వేదికగా పిలుపునివ్వడంతో వేలాది మంది విద్యార్థులు ఢిల్లీ వచ్చారు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. అయితే కేంద్ర బలగాలు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో పరస్పరం దాడులు జరిగాయి. దీంతో చాలామంది విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు కూడా అదే స్థాయిలో క్షతగాత్రులుగా మిగిలారు.. అయితే ఈ వ్యవహారం మరింత తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో కేంద్రం ఒత్తిడి తీసుకురావడంతో సోనం తన దీక్షను విరమించారు. అంతేకాదు నీట్ లీకు వీరులను శిక్షిస్తామని.. ఇందుకోసం ప్రత్యేకంగా న్యాయస్థానాలను ఏర్పాటు చేస్తామని స్వయంగా ప్రధానమంత్రి హామీ ఇవ్వడంతో సోనం తన దీక్షను విరమించారు.

సోనం దీక్ష చేస్తున్న సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఢిల్లీలో విద్యార్థులు చేస్తున్న నిరసనలకు ఆయన తన సంఘీభావాన్ని ప్రకటించారు. దీంతో సల్మాన్ ఖాన్ తీవ్రస్థాయిలో విమర్శలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఒకసారిగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. అంతేకాదు ఈ దేశంలో విద్యకు.. భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుందని.. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు. నీట్ పేపర్లను లీక్ చేసిన వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. అలాంటప్పుడు విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు. విద్యార్థులు తమ ఇండ్లలోకి వెళ్లాలని సూచించారు. అంతేకాదు సోనం దీక్ష విరమించిన తర్వాత.. తన ఇంటి నుంచి భోజనం పంపిస్తానని.. ఏదైనా తినండి అంటూ.. సల్మాన్ ఖాన్ ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

జరిగిన వాస్తవం తెలుసుకోకుండా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేయకుండా కేవలం ఏకపక్షంగా సల్మాన్ ఖాన్ ట్వీట్ చేయడం సంచలనం కలిగించింది. దీంతో ఆయన సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. అంతేకాదు జరిగిన ఘటన పట్ల బాధపడుతున్నట్టు పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్ ఏకంగా ఇంటి భోజనం పంపిస్తానని సోనం కు చెప్పడం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Chiranjeevi: చిరంజీవి కెరియర్ లో చేసిన మూడు తప్పులు ఇవే…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒక సామాన్య మానవుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా మారవచ్చు అని ప్రూవ్ చేసిన...

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ వెనక ఇన్ని కారణాలున్నాయి…

Vijay Deverakonda: 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ... ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా...

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
Oktelugu Epaper
Exit mobile version