MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్య‌ల‌పై దుమారం? మంగ‌ళ్ హాట్ పీఎస్ లో ఎఫ్ ఐఆర్ న‌మోదు

MLA Raja Singh: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా చేసిన వ్యాఖ్య‌ల‌పై రాజ‌కీయ దుమార‌మే రేగుతోంది. యూపీలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో హైద‌రాబాద్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం క‌లిగిస్తున్నాయి. దీంతో ఎన్నిక‌ల సంఘం రాజాసింగ్ మాట‌ల‌పై ఫోక‌స్ పెట్టింది. ఆయ‌న‌పై కేసు న‌మోద చేసింది. హైద‌రాబాద్ లోని మంగ‌ళ్ హాట్ పోలీస్ స్టేష‌న్ లో ఈ మేర‌కు కేసు బుక్క‌యింది. పైగా ఎమ్మెల్యే వ్యాఖ్య‌లు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయ్యాయి. రాజాసింగ్ మాట‌ల‌తో రాజ‌కీయం […]

Written By: Srinivas, Updated On : February 20, 2022 2:11 pm
Follow us on

MLA Raja Singh: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా చేసిన వ్యాఖ్య‌ల‌పై రాజ‌కీయ దుమార‌మే రేగుతోంది. యూపీలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో హైద‌రాబాద్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం క‌లిగిస్తున్నాయి. దీంతో ఎన్నిక‌ల సంఘం రాజాసింగ్ మాట‌ల‌పై ఫోక‌స్ పెట్టింది. ఆయ‌న‌పై కేసు న‌మోద చేసింది. హైద‌రాబాద్ లోని మంగ‌ళ్ హాట్ పోలీస్ స్టేష‌న్ లో ఈ మేర‌కు కేసు బుక్క‌యింది. పైగా ఎమ్మెల్యే వ్యాఖ్య‌లు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయ్యాయి.

MLA Raja Singh

రాజాసింగ్ మాట‌ల‌తో రాజ‌కీయం వేడెక్కుతోంది. యూపీలో బీజేపీకి ఓటు వేయ‌కుండా ఇళ్లు కూల్చేస్తామ‌ని రాజాసింగ్ చెప్పిన మాట‌ల‌క ఎన్నిక‌ల సంఘం త‌ప్పు ప‌ట్టింది. ఓట‌ర్ల‌ను భ‌య‌పెట్టిన రాజాసింగ్ ఓట‌ర్ల‌ను బెదిరింపుల‌కు గురిచేయ‌డం చ‌ట్ట‌ప‌రంగా నేర‌మ‌ని చెప్పింది. దీంతో రాజాసింగ్ పై నిషేధం విధిస్తున్న‌ట్లు పేర్కొంది. మొత్తానికి ఓట్లు రాలుస్తార‌ని భావించిన సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఇలా చేయ‌డంపై బీజేపీ అంత‌ర్మ‌థ‌నంలో ప‌డింది.

రాజాసింగ్ వ్యాఖ్య‌ల‌పై స‌మాధానం ఇవ్వాల‌ని ఈనెల 19 మ‌ధ్యాహ్నం వ‌ర‌కు గ‌డువు ఇచ్చింది. దీంతో ఆయ‌న స‌మాధానం ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆయ‌న‌పై కేసు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. కేంద్రం ఎన్నిక‌ల సంఘం ఆదేశాల మేర‌కు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఎఫ్ ఐఆర్ న‌మోదు చేయ‌డం తెలిసిందే.

Also Read: జ‌గ్గారెడ్డి వ‌ర్సెస్ రేవంత్ రెడ్డిః కాంగ్రెస్ లో కొన‌సాగుతున్న విభేదాలు
ఈ మేర‌కు రాజాసింగ్ పై వెస్ట్ జోన్ మంగ‌ళ్ హాట్ పోలీస్ స్టేష‌న్ లో కేసు న‌మోదు కావ‌డంతో పాటు ఆయ‌నపై నిషేధం విధించింది. ఆయ‌న ర్యాలీలు, బ‌హిరంగ స‌భ‌ల్లో కూడా పాల్గొన‌కూడ‌ద‌ని సూచించింది. ఇప్ప‌టి నుంచి 72 గంట‌ల పాటు ఆయ‌న ఎక్క‌డ కూడా ప్రెస్ మీట్ల కూడా పాల్గొన‌రాద‌ని చెప్పింది. దీంతో రాజాసింగ్ పై నిషేధం విధించిన సంద‌ర్భంలో ఎమ్మెల్యే తీరుపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

దీంతో యూపీలో బీజేపీకి ఓట్లు రాల‌తాయో లేదో కానీ పార్టీ ప‌రువు మాత్రం పోయింది. ఇన్నాళ్లు కాపాడుకున్న ప్ర‌తిష్ట మ‌స‌క‌బారిపోయిన‌ట్లు అయింది. ఈ క్ర‌మంలో బీజేపీ యూపీలో నెగ్గుతుందా? లేక ఓట‌మి పాలవుతుందో తెలియ‌డం లేదు.

Also Read: మూడో కూట‌మి ఏర్పాటుకు కేసీఆర్ ప్ర‌య‌త్నాలు ఫ‌లించేనా?

Tags