BSNL : టెలికాం వినియోగదారులందరూ తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ అందించే రీఛార్జ్ ప్లాన్ల కోసం వెతుకుంటారు. కానీ ప్రస్తుత రీఛార్జీ ధరల పెరుగుదల నేపథ్యంలో అలాంటి ప్లాన్‌లు దాదాపు కనుమరుగయ్యాయి. మళ్లీ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలు పెరిగే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కోట్లాది మంది వినియోగదారులకు మరింత భారంగా మారనుంది. అలాంటి పరిస్థితుల్లో కేవలం రూ.107 ఖర్చుతో నెల రోజుల కంటే ఎక్కువ వ్యాలిడిటీని అందించే ఒక చౌకైన రీఛార్జ్ ప్లాన్ ను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. కేవలం రూ.107తో ఈ సంస్థ ప్రీపెయిడ్ వినియోగదారులకు అందిస్తుంది. అలాగే, ఈ ప్లాన్‌కు పోటీగా రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, Vi ఎలాంటి ప్లాన్ ఇస్తున్నాయో వివరంగా తెలుసుకుందాం.
Also Read : బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే ఏడాదంతా వ్యాలిడిటీ
BSNL రూ.107 ప్లాన్ వివరాలు:
రూ.107 రీఛార్జ్ ప్లాన్‌తో కంపెనీ 3GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. దీనితో పాటు, ఏదైనా నెట్‌వర్క్‌కు లోకల్, STD కాలింగ్ కోసం 200 నిమిషాలు కూడా లభిస్తాయి. డేటా, కాలింగ్‌తో పాటు ఈ ప్లాన్ ఉచిత BSNL ట్యూన్‌ను కూడా అందిస్తుంది.
BSNL రూ.107 ప్లాన్ వ్యాలిడిటీ:
వ్యాలిడిటీ విషయానికి వస్తే రూ.107 ప్లాన్ మీకు 35 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది. ఈ ప్లాన్‌లో డే, కాలింగ్ ప్రయోజనాలు ఉన్నప్పటికీ, SMS సౌకర్యం లేకపోవడం కొంత అసౌకర్యాన్ని కలిగించవచ్చు.
Jio-Airtel-Vi వద్ద ఇలాంటి ప్లాన్ ఉందా?
BSNL రూ.107 ప్లాన్‌కు పోటీగా ప్రస్తుతం రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, Vi వంటి కంపెనీల వద్ద ఎటువంటి ప్లాన్ లేదు. ఈ మూడు కంపెనీల వద్ద తక్కువ ధరలో 35 రోజుల వ్యాలిడిటీని అందించే ఒక్క ప్లాన్ కూడా అందుబాటులో లేదు.
Also Read : 17 ఏళ్ల తర్వాత లాభాలు.. బీఎస్ఎన్ఎల్ కు ఇది కలయా.. నిజమా? అసలేం జరిగింది?
