https://oktelugu.com/

BSNL : 17 ఏళ్ల తర్వాత లాభాలు.. బీఎస్ఎన్ఎల్ కు ఇది కలయా.. నిజమా? అసలేం జరిగింది?

బిఎస్ఎన్ఎల్ మరింతగా అభివృద్ధి చెందాలని.. భారీగా లాభాలను సంపాదించి పెట్టే ప్రభుత్వ సంస్థగా ఎదగాలని నెటిజన్లు కోరుతున్నారు..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : February 14, 2025 / 10:03 PM IST
    Follow us on

    BSNL : సిగ్నల్ సరిగ్గా ఉండదు. ఆఫర్లు అంతంత మాత్రం గానే ఉంటాయి. సర్వీస్ అత్యంత దారుణంగా ఉంటుంది. పోటీ కంపెనీలు దూసుకుపోతుంటే.. టెక్నాలజీ పరంగా అప్డేట్ అవుతుంటే.. అది మాత్రం అలాంటివి తనకు పట్టనట్టుగా వ్యవహరిస్తుంటుంది. ఏదో వచ్చిందే ఆదాయం అన్నట్టుగా ఉంటుంది. పైగా ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అది ఎక్స్ ట్రా ఫింగర్ గా మారిపోయింది. చివరికి గుదిబండ సంస్థల్లో అది ఒకటిగా రూపాంతరం చెందింది.

    అలాంటి సంస్థ ఇప్పుడు లాభాలు గడిచింది. ఒకటి కాదు రెండు కాదు 17 సంవత్సరాల లో మొదటిసారిగా 262 కోట్లకు పైగా లాభాలను అర్జించింది. 2007 తర్వాత BSNL ఈ స్థాయిలో లాభాలను పొందడం ఇదే తొలిసారి. నెట్వర్క్ ను వేగవంతంగా విస్తరించడం.. తక్కువ ధరలోనే సేవలందించడం వంటివి బిఎస్ఎన్ఎల్ విజయానికి దోహదం చేశాయని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెబుతున్నారు. ” దేశంలో టెలికాం రంగం అద్భుతమైన ప్రగతిని సాధిస్తోంది. అయితే ఈ ప్రయాణంలో ఈరోజు చాలా ముఖ్యమైనది.. భారతదేశానికి దిక్సూచి లాగా టెలికాం రంగం పనిచేస్తున్నది. భవిష్యత్తు కాలంలో అభివృద్ధికి కీలక స్తంభంగా మారుతుంది. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదేపదే చెబుతున్నారు.. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు మొత్తం ఈ లక్ష్యం వైపుగా ప్రయాణం చేస్తున్నారు.. డిజిటల్ యుగంలో భారత్ కొత్త శిఖరాలను అధిరోహిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిలాష కూడా ఇదే. దాని వైపుగానే భారత్ అడుగులు వేస్తానని” జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు.

    విజయానికి కారణం ఇదే

    బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ను విస్తరించింది. తక్కువ ధరతో కస్టమర్లకు సేవలు అందిస్తోంది. అందువల్లే ఈ స్థాయిలో ఆదాయాన్ని సాధించింది. ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఆదాయ వృద్ధి 20 శాతం కంటే ఎక్కువ మెరుగుపడుతుందని బిఎస్ఎన్ఎల్ భావిస్తోంది. దాదాపు 262 కోట్ల లాభం ద్వారా బిఎస్ఎన్ఎల్ మరింత మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కంపెనీ ఆర్థిక ఖర్చులు, మొత్తం వ్యయం కూడా తగ్గడం లాభాలు పెరగడానికి కారణమైంది. ఫలితంగా గత సంవత్సరంతో పోల్చితే నష్టాలు ఏకంగా 1800 కోట్లకు తగ్గాయి.. దీనికి తోడు దేశంలో టెల్కో మోబిలిటీ సేవలు ఆదాయం పదిని శాతం వరకు పెరిగింది.. ఫైబర్ టు ది హోమ్ (FITH) ఆదాయం కూడా 18% పెరిగింది. దీని మీద అంతే స్థాయిలో అమ్మ కూడా వచ్చింది..లీజు కు కొన్ని లైన్లను ఇవ్వడం ద్వారా బిఎస్ఎన్ఎల్ 14 శాతం ఆదాయాన్ని పెంచుకుంది. అయితే నెట్వర్క్ ను మరింత విస్తరించడం ద్వారా.. ఇంకా ఎక్కువ లాభాలు పొందాలని బిఎస్ఎన్ఎల్ భావిస్తోంది. మొత్తానికి 17 సంవత్సరాల తర్వాత లాభాలను కళ్ల చూడటంతో కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. మొత్తానికి బిఎస్ఎన్ఎల్ బతికి బట్టకట్టిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బిఎస్ఎన్ఎల్ కు లాభాలు రావడంతో సోషల్ మీడియాలో రకరకాల సందేశాలు వ్యాప్తిలోకి వచ్చాయి. ఇది కలలా ఉందని.. నిజంగా ఈ స్థాయిలో లాభాలు రావడం గొప్ప విషయమని.. బిఎస్ఎన్ఎల్ మరింతగా అభివృద్ధి చెందాలని.. భారీగా లాభాలను సంపాదించి పెట్టే ప్రభుత్వ సంస్థగా ఎదగాలని నెటిజన్లు కోరుతున్నారు.. నిజంగా బిఎస్ఎన్ఎల్ ఇలా రూపాంతరం చెందుతుందని కలలో కూడా ఊహించలేదని నెటిజన్లు పేర్కొంటున్నారు.