BSNL 365 Days Plan
BSNL 365 Days Plan: ప్రైవేట్ టెలికాం సంస్థలు అన్నీ తమ రీఛార్జీ ధరలను పెంచడంతో ఇప్పుడు కస్టమర్ల ఫోకస్ అంతా ప్రభుత్వ ఆధారిత బీఎస్ఎన్ఎల్ వైపు మళ్లింది. రోజుల వేలాది మంది బీఎస్ఎన్ఎల్ కు పోర్టు అవుతున్నారు. ఈ క్రమంలోనే బీఎస్ఎన్ఎల్ కూడా అందుకు తగ్గట్టుగానే రెడీ అవుతుంది. దీంతో కొన్నేళ్ల తర్వాత బీఎస్ఎన్ఎల్ లాభాల్లోకి వచ్చింది. కస్టమర్లకు ఆకర్షించేందుకు కొత్త కొత్త ప్లాన్లను అందుబాటులోకి తెస్తుంది. ఈ క్రమంలోనే తక్కువ ధరలో బీఎస్ఎన్ఎల్ 365 రోజుల కొత్త ప్లాన్ లాంచ్ చేసింది.
Also Read : అంబానీ జియోను చావుదెబ్బకొట్టిన ఎయిర్ టెల్..ఏకంగా ఎలన్ మస్క్ తో జట్టు
కస్టమర్లను అవసరాలను తీర్చుకునే విధంగా.. ప్రైవేట్ టెలికాం కంపెనీల నుంచి పోటీని తట్టుకుని నిలబడే విధంగా ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్ని బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది. ఇది చౌకగా ఉండడం మాత్రమే కాకుండాచాలా మంది కస్టమర్లకు ఉపయోగపడే విధంగా బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ఈ వార్షిక రీఛార్జ్ ప్లాన్ వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన కొత్త ప్లాన్ లో ఒకసారి రీఛార్జి చేసుకుంటే ఏడాది అంటే 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్ సిమ్‌ను సెకండరీ నంబర్‌గా వాడే యూజర్లకు ఈ ప్లాన్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బీఎస్ఎన్ఎల్ 365 రోజుల ప్లాన్ ధర కేవలం రూ .1198 మాత్రమే. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు ఉంటుంది. దీని ప్రకారం దీని నెలవారీ సగటు సుమారు రూ.100కే లభిస్తుంది. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు సిమ్ యాక్టివ్ గా ఉండాలనుకునే యూజర్లకు ఈ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది.
బీఎస్ఎన్ఎల్ ఈ 365 రోజుల ప్లాన్‌తో కస్టమర్లు ప్రతి నెలా 300 నిమిషాల వరకు ఏ నెట్ వర్క్ కు అయినా ఉచిత కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. ఇది కాకుండా ప్రతి నెలా 30 ఉచిత ఎస్ఎంఎస్‌లతో పాటు ప్రతి నెలా 3 జీబీ హై స్పీడ్ డేటా కూడా లభిస్తుంది. అంతేకాకుండా దేశం అంతటా రోమింగ్ సమయంలో ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్ కూడా పొందుతారు.
బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ నెట్‌వర్క్ విస్తరణకు కేంద్రం సుమారు రూ.6,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ 4జీ సేవలను అప్‌గ్రేడ్ చేసేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది. తద్వారా త్వరలోనే కస్టమర్లకు మెరుగైన నెట్ వర్క్, వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.
Also Read : టాటా ప్లేతో జత కట్టిన ఎయిర్ టెల్.. త్వరలో డిజిటల్ టీవీ.. డీటీహెచ్‌కు ఆదరణ తగ్గుతుండడంతో కీలక నిర్ణయం!