CM Revatnth Reddy : తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revatnth Reddy) మొదటి నుంచి కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నెల రోజులకే విదేశీ పర్యటనకు వెళ్లారు. తర్వాత ఏడాది కూడా భారీగా పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేసుకున్నారు. తాజాగా జపాన్(Japan) పర్యటనలో రూ.12 వేలు కోట్ల ఒప్పందాలు చేసుకున్నారు. 30 వేల(30 Thousend) మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేశారు.
Also Read : ఎంపీకి గట్టిగా క్లాస్ పీకిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి(Telangana CM) ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం జపాన్(Japan)లో ఏడు రోజుల పర్యటనలో పలు కీలక ఒప్పందాలు(Agriments) కుదుర్చుకొని రూ.12,062 కోట్ల పెట్టుబడులను సాధించింది. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో సుమారు 30,500 ఉద్యోగావకాశాలు(Employement) సృష్టించే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో అత్యాధునిక సాంకేతిక కేంద్రాలు, పారిశ్రామిక పార్కుల ఏర్పాటుతో పాటు, తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పించే ఒప్పందాలు ఈ పర్యటనలో భాగంగా జరిగాయి.
నెక్స్‌ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్
జపాన్‌కు చెందిన మారుబెని కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ హైదరాబాద్(Hyderabad) ఫ్యూచర్ సిటీలో నెక్స్‌ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది. దీని కోసం ప్రారంభంగా రూ.1,000 కోట్లు పెట్టుబడి పెట్టనుండగా, మొత్తంగా రూ.5,000 కోట్ల వరకు పెట్టుబడులు చేయాలని అంచనా వేసింది. ఈ ప్రాజెక్ట్ రాష్ట్రంలో అధునాతన పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడనుంది.
ఏఐ డేటా సెంటర్ క్లస్టర్
ఎన్‌టీటీ డేటా, నెయిసా సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం రూ.10,500 కోట్ల పెట్టుబడులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థలు హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) డేటా సెంటర్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. ఈ ప్రాజెక్ట్ రాష్ట్రాన్ని సాంకేతిక ఆవిష్కరణల కేంద్రంగా మార్చడంలో కీలక పాత్ర పోషించనుంది, అలాగే యువతకు అధిక నైపుణ్య ఉద్యోగాలను అందించనుంది.
రుద్రారంలో విద్యుత్ పరికరాల తయారీ ఫ్యాక్టరీ
తోషిబా(Thoshiba) ట్రాన్స్‌మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా (టీటీడీఐ)తో ఒప్పందం ద్వారా రూ.562 కోట్ల పెట్టుబడితో రుద్రారంలో విద్యుత్ పరికరాలు, సామగ్రి తయారీ ఫ్యాక్టరీ నెలకొల్పనున్నారు. ఈ యూనిట్ రాష్ట్రంలో శక్తి వనరుల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, స్థానిక యువతకు ఉద్యోగావకాశాలను కల్పించనుంది.
జపాన్‌లో తెలంగాణ యువతకు ఉద్యోగాలు..
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ’టామ్ కామ్’ సంస్థ టెర్స్, రాజ్ గ్రూప్‌లతో చేసుకున్న ఒప్పందాల ఫలితంగా, తెలంగాణకు చెందిన 500 మంది యువతకు జపాన్‌లో ఉద్యోగ నియామకాలకు మార్గం సుగమమైంది. ఈ చర్య రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలను తెరవడంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది.
సమావేశాలు, సందర్శనలు
ఈ నెల 15న హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా జపాన్‌కు బయలుదేరిన ముఖ్యమంత్రి బందం, 16న టోక్యో చేరుకొని 22 వరకు పర్యటించింది. ఈ పర్యటనలో జపాన్ పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించి, తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానించారు. మురసాకి రివర్ మ్యూజియం, ఒసాకా రివర్ ఫ్రంట్‌లను సందర్శించిన బందం, హిరోషిమా డిప్యూటీ గవర్నర్‌తో భేటీ అయి పెట్టుబడులపై చర్చలు జరిపింది. ఈ పర్యటనలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంపీ కె. రఘువీర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
హిరోషిమాతో సహకారం..
హిరోషిమా ప్రిఫెక్చర్ ప్రతినిధులతో తెలంగాణ బృందం సమావేశమై, రెండు రాష్ట్రాల మధ్య సహకార అవకాశాలపై చర్చించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హిరోషిమా డిప్యూటీ గవర్నర్ మికా యోకోటాతో జరిపిన సమావేశంలో, శాంతి, సాంకేతిక పురోగతి, సుస్థిరతపై తెలంగాణ దష్టిని వివరించారు. ‘‘కలిసి పనిచేద్దాం, అద్భుత భవిష్యత్‌ను నిర్మిద్దాం,’’ అని ఆయన ఆకాంక్షించారు. మంత్రి శ్రీధర్ బాబు, క్లీన్ టెక్నాలజీ, వ్యర్థ నిర్వహణ, పునరుత్పాదక ఇంధనం, ఆటోమోటివ్ కారిడార్ వంటి రంగాల్లో సహకార ప్రతిపాదనలను ప్రస్తావించారు.
హిరోషిమాలో జయ జయహే తెలంగాణ..
తెలంగాణ బృందం హిరోషిమా ప్రిఫెక్చరల్ అసెంబ్లీ హాల్‌ను సందర్శించి, అసెంబ్లీ స్పీకర్ తకాషి నకమోటోతో సమావేశమైంది. రేవంత్ రెడ్డి, హిరోషిమాను ప్రజల ఐక్యతకు చిహ్నంగా అభివర్ణించి, తెలంగాణ కూడా ప్రజల ఆకాంక్షలకు ప్రతీక అని పేర్కొన్నారు. బృందం హిరోషిమా ఛాంబర్ ఆఫ్ కామర్స్, గాంధీ మెమోరియల్, శాంతి స్మారక ఉద్యానవనం, అణుబాంబు దాడిని తట్టుకున్న డోమ్‌ను సందర్శించింది. ఈ సందర్భంగా ఇద్దరు తెలుగు విద్యార్థినులు రేవంత్ రెడ్డి చిత్రపటాలను అందజేసి, ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని ఆలపించారు.
జపాన్ పర్యటన ద్వారా తెలంగాణ ప్రభుత్వం అధునాతన సాంకేతికత, పారిశ్రామిక అభివద్ధి, ఉద్యోగ సృష్టిలో కీలక ముందడుగు వేసింది. హిరోషిమాతో సహకారం, రాష్ట్ర యువతకు అంతర్జాతీయ అవకాశాలు రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా మార్చే దిశలో నడిపిస్తాయి.
Also Read : సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం