Budget ACs : ప్రస్తుతం వేసవి ముదిరిపోయింది. భరించలేని వేడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఏసీలు, కూలర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. మీరు కూడా కొత్త ఏసీ కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫీచర్లున్న ఏసీ కోసం చూస్తున్నారా.. ప్రస్తుత ధరలు చూసి వెనక్కి తగ్గుతున్నారా? అయితే అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ బడ్జెట్‌లో దొరికే కొన్ని అద్భుతమైన ఏసీల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. వీటిని ఇంటి నుంచే ఆన్‌లైన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు, ఇక్కడ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, బ్యాంక్ ఆఫర్‌లు, ప్లాట్‌ఫారమ్ డిస్కౌంట్‌ల వంటి ప్రయోజనాలు కూడా లభిస్తున్నాయి.
Also Raed : ఏసీని కొనాలి అనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
రూ.40,000 లోపు లభించే బెస్ట్ ఏసీలు
Hitachi 1.5 టన్ ఏసీ: ఈ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ 42 శాతం డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీనిని నో కాస్ట్ ఈఎంఐపై కూడా కొనుగోలు చేయవచ్చు. దీనికి నెలకు కేవలం రూ.1,793 ఈఎంఐ చెల్లిస్తే సరిపోతుంది.
Blue Star 1.5 టన్ ఏసీ: ఈ ఏసీ 42 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.37,490కే అందుబాటులో ఉంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది వాయిస్ అసిస్ట్ ఫీచర్‌ను సపోర్ట్ చేస్తుంది.
Lloyd 1.5 టన్: ఈ 3 స్టార్ ఎయిర్ కండీషనర్ అసలు ధర రూ.58,999. కానీ ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్‌తో రూ.34,000 నుండి రూ.37,000 మధ్య లభిస్తోంది. ఈ ఏసీపై కూడా నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.
Voltas 1.5 టన్ ఏసీ: 4 ఇన్ 1 అడ్జస్టబుల్ మోడ్‌తో వచ్చే ఈ ఏసీని మీరు డిస్కౌంట్‌తో రూ.33,990కి కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్‌లో ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డుతో చెల్లిస్తే రూ.3,000 వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.
Whirlpool 1.5 టన్ 3 స్టార్: ఈ ఏసీ ఏకంగా 51 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.30,490కే లభిస్తోంది. ఈ ఏసీలో అనేక అద్భుతమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ ఏసీలపై కంపెనీ, ప్లాట్‌ఫారమ్ వారంటీ కూడా లభిస్తోంది. ఈ ఏసీలే కాకుండా బడ్జెట్‌లో ఇమిడిపోయే మరిన్ని ఆప్షన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.
Also Read : వేసవిలో మీ ఏసీని కొత్తగా ఉంచే సీక్రెట్ ఇదే!