కేటీఆర్ పై యుద్ధంలో గెలిచిన బీజేపీ

సమస్యలపై యుద్ధాన్ని నేరుగా తలపడి చేయడమే కాదు.. సోషల్ మీడియా ద్వారా కూడా చేయవచ్చని బీజేపీ నిరూపించింది. బీజేపీ వచ్చాక సోషల్ మీడియాను తెగ వాడేస్తోందన్న సంగతి తెలిసిందే. దేశ ప్రధాని మోడీ తలపెట్టిన ఈ తంతును ఇప్పుడు బీజేపీ నేతలు పుణికిపుచ్చుకున్నారు. All Read: కేసీఆర్ పై గవర్నర్ సీరియస్.. ఎందుకంటే? తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పుడు సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. ఇటీవల వరంగల్ లో వరదల భీభత్సంపై ఫొటోలు, వీడియోలు […]

Written By: NARESH, Updated On : August 19, 2020 3:25 pm
Follow us on


సమస్యలపై యుద్ధాన్ని నేరుగా తలపడి చేయడమే కాదు.. సోషల్ మీడియా ద్వారా కూడా చేయవచ్చని బీజేపీ నిరూపించింది. బీజేపీ వచ్చాక సోషల్ మీడియాను తెగ వాడేస్తోందన్న సంగతి తెలిసిందే. దేశ ప్రధాని మోడీ తలపెట్టిన ఈ తంతును ఇప్పుడు బీజేపీ నేతలు పుణికిపుచ్చుకున్నారు.

All Read: కేసీఆర్ పై గవర్నర్ సీరియస్.. ఎందుకంటే?

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పుడు సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. ఇటీవల వరంగల్ లో వరదల భీభత్సంపై ఫొటోలు, వీడియోలు తెలంగాణ వ్యాప్తంగా సర్క్యూలేట్ అయ్యాయి. అక్కడి ఘోరాలను కళ్లకు కట్టాయి. అయితే ఈ వీడియోలను బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సోషల్ మీడియాలో షేర్ చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.వరంగల్ నగరానికి కేసీఆర్ ఇచ్చిన హామీలను బండి సోషల్ మీడియాలో గుర్తు చేశారు.

దీంతో దెబ్బకు దిగివచ్చిన తెలంగాణ సర్కార్ వెంటనే మంత్రి కేటీఆర్ ను రంగంలోకి అక్కడ పర్యటింపచేసి నష్టనివారణ చర్యలు చేపట్టింది. బండి సంజయ్ ట్వీట్ వల్లే ఇప్పుడు కేటీఆర్ కదిలారని బీజేపీ శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయి. ప్రత్యక్షంగానే కాదు.. సోషల్ మీడియా ద్వారా కూడా యుద్ధం చేసి గెలవొచ్చని బీజేపీ ఈ దెబ్బతో నిరూపించింది.

All Read: తెలిసిందిగా.. కేటీఆరే వర్కింగ్ సీఎం అన్నట్టు?

ఇక మరో విశేషం ఏంటంటే.. ఇదే కేటీఆర్ మాందీ మార్బలంతో పర్యటించిన తీరును కూడా సోషల్ మీడియాలో బీజేపీ ఎండగట్టడం విశేషం.ఓ వైపు కరోనా.. మరో వైపు వర్షాలు కురుస్తున్న వేళ ఇలా 25కి పైగా వాహనాల కాన్వాయ్ తో కేటీఆర్ వరంగల్ లో పర్యటించడం వివాదాస్పదమైంది. దాని ఫొటోలు, వీడియోలు తీసి కేటీఆర్ రాజులాగా ఇలా చేశారని బీజేపీ ప్రచారం చేసింది. ప్రజల్లోనూ దీనిపై వ్యతిరేక భావన ఏర్పడింది. ఇంత క్లిష్టసమయంలో ఇలా ప్రచార ఆర్భాటం అవసరమా అని స్థానికులు మండిపడ్డారు.

ఇలా ఇంట్లోనే ఉండి బీజేపీ కాగల కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసింది. కేవలం సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ ను కదిలించి ఓడించిన తీరు నిజంగా అద్భుతమని బీజేపీ శ్రేణులు సంబరపడుతున్నాయి.