ప్రపంచ దేశాల ప్రజలను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో నమోదవుతున్న కేసులు వైరస్ పట్ల ప్రజల్లో తీవ్ర భయాందోళనను కలుగజేస్తున్నాయి. ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతూ ఉండగా పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. అయితే ఇదే సమయంలో జపాన్ లో వింత రోగం ప్రజలను మరింత భయపెడుతోంది.
ప్రజలు అకస్మాత్తుగా రోడ్లపై పడి నిద్రపోతూ ఉండటం జపాన్ లో జరుగుతోంది. వినడానికి వింతగా ఉన్నా జపాన్ లో చాలా మంది ప్రజలు ఈ విధంగా రోడ్లపై పడి నిద్రపోతున్నారు. అయితే ప్రజలు ఏ కారణం వల్ల ఈ విధంగా రోడ్లపై పడిపోతున్నారో తెలియట్లేదు. జపాన్ లోని ఒకినోవో నగరంలో ఈ వింత రోగం బయటపడింది ఈ వింత రోగాన్ని అక్కడి ప్రజలు రోజో నీ పేరుతో పిలుస్తున్నారు. రోడ్డుపై పడి నిద్రపోవడాన్ని రోజో నీ అని అంటారు.
జపాన్ లో ప్రస్తుతం వేసవి కాలం నడుస్తోంది. అక్కడ ఎండలు మండిపొతూ ఉండటంతో ప్రజలు ఈ విధంగా చేస్తున్నారని అదేం వింత రోగం కాదని మరికొందరు చెబుతున్నారు. అయితే మద్యం సేవించిన వ్యక్తులు, మద్యం సేవించని వ్యక్తులు, మహిళలు కూడా సొమ్మసిల్లి పడిపోతూ ఉండటం గమనార్హం. వింత రోగం వల్ల కొందరు ఎక్కడపడితే అక్కడ పడిపోతూ ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకు నగరంలో 7000 కేసులు నమోదయ్యాయి. వైద్యులు ఈ వింత రోగానికి గల కారణాలను కనిపెట్టలేకపోతున్నారు. శాస్త్రవేత్తలు ఈ వ్యాధికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధ్యయనం చేయటం మొదలుపెట్టారు.