BJP Mission South India: ఉత్తర భారత దేశంలో అప్రతిహత జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారతీయ జనతాపార్టీ ఇప్పుడు తన దృష్టంతా దక్షిణ భారతంపై పెట్టింది. ఐదు నెలల క్రితం జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాలు కాషాయం ఖాతాలోనే చేరాయి. ఆతర్వా నుంచే దక్షిణ భారతదేశంపై కమలనాథులు దృష్టిపెట్టారు. ఇందులో భాగంగానే ఇటీవల హైదారబాద్‌లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించారు. సాధారణంగా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏ పార్టీ అయినా ప్లీనరీలు, జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తుంది. బీజేపీ మాత్రం అందుకు భిన్నంగా తెలంగాణ రాజధాని హైదారబాద్‌లో నిర్వహించింది. ప్లీనరీ సమావేశాలు, తర్వాత నిర్వహించిన విజయ సంకల్ప సభకు ఆటంకం కల్పించేందుకు స్థానిక టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక విధాలుగా యత్నించినా సభ విజయవంతం కావడంతో కమలదళంలో జోష్ నెలకొంది. ఈ క్రమంలో ఇక దక్షిణ భారత దేశంలో ఏ ఎన్నికలు వచ్చినా విజయం సాధించాలని జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీర్మానించారు. ఈ మేరకు కార్యాచరణ సైతం సిద్ధం చేస్తున్నారు.

రాష్ట్రపతి ఎన్నికల తర్వాత..
దేశ రాష్ట్రపతిగా తొలిసారి ఓ గిరిజన మహిళ ద్రౌపదిముర్ముకు బీజేపీ అవకాశం కల్పించింది. ఈనెల 18న ఎన్నికలు జరుగనున్నాయి. ద్రౌపది ముర్ము కూడా దక్షిణ భారతీయురాలే. ఒడిశాకు చెందిన ఈమె ఎన్నికల లాంఛనమే. మరోవైపు నాలుగు రాజ్యసభ స్థానాలకు ఇటీవలే నలుగురిని దక్షిణ భారత దేశం నుంచే నామినేట్ చేసింది. అంటే దక్షిణాదిన పట్టుకోసం బీజేపీ ఎంత ప్రయత్నిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి ఏపీలోని అధికార వైఎస్సార్‌సీపీ మద్దతు ప్రకటించింది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌సిన్హాకు తెలంగాణలోని అధికార టీఆరఎస్ మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పట్టుకోసం ప్రయత్నిస్తున్న బీజేపీ రాష్ట్రపతి ఎన్నికలు ముగిసే వరకు వేచిచూసే ధోరణి అవలంబిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జూలై 18 తర్వాత రెండు తెలుగు రాస్ట్రాలపై పంజా విసురుతుందని రాజకీయ విశ్లేషకుల భావిస్తున్నారు.
రెండు ప్రభుత్వాలు.. భినన మైన మార్గాలు..
రాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలు భిన్నమైన మార్గంలో వెళ్తున్నాయి. ఏపీ నుంచి దాదాపుగా అన్ని పార్టీలు బీజేపీ, ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించాయి. తెలంగాణలో మాత్రం టీఆర్‌ఎస్ యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించింది. తెలంగాణలో అధికార పార్టీ బీజేపీతో ఢీ అంటే ఢీ అంటుంది. పైగా ఎన్నికల మూడ్ వచ్చేసింది. ఇప్పుడు బీజేపీ అక్కడ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సి ఉంటుంది. చేరికలతో పార్టీని బలోపేతం చేసుకోవాల్సి ఉంది. ఇప్పటికే టీఆర్‌ఎస్ నేతల చిట్టా అంతా దగ్గర పెట్టుకుని ఇక దర్యాప్తు సంస్థలతో విరుచుకుపడటమే మిగిలిందన్న ప్రచారం జరుగుతోంది. రాష్ట్రపతి ఎన్నికల వరకూ డిస్ట్రబెన్స్ ఎందుకని ఆగిందని చెబుతున్నారు. అయితే విచిత్రంగా ఏపీలోనూ అలాంటి ప్రచారమే జరుగుతోంది.

పూర్తి స్థాయిలో బీజేపీకి మద్దతుగా ఉంటున్న వైసీపీ విషయంలో బీజేపీ ఎందుకు కఠినంగా ఉంటుందన్న చర్చ అందుకే జరుగుతోంది. ఏపీ ప్రభుత్వానికి అండగా ఉంటే తమకే నష్టమని కేంద్ర బీజేపీ వర్గాలు అంచనాకు వచ్చాయంటున్నారు. దిగజారిపోయిన ఆర్థిక పరిస్థితితో పాటు దారుణంగా ఉన్న రాజ్యాంగ ఉల్లంఘనల కారణంగా మద్దతుగా ఉండటం కన్నా నిబంధనల ప్రకారం ఉంటే ఏ ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. కేంద్రం రూల్స్ ప్రకారం వ్యవహరించినా అది ఏపీ సర్కార్‌కు శిక్షలాంటిదే అనుకోవచ్చంటున్నారు. అయితే బీజేపీ ఏదైనా చేయాలనుకుంటే రాష్ట్రపతి ఎన్నికల్లాంటి ముహుర్తాలు పెట్టుకోదని అనేక ఘటనలు రుజువు చేస్తున్నాయి. అంత దాకా ఎందుకు రాష్ట్రపతి ఎన్నికల్లో ముర్ముకే మద్దతు ప్రకటించిన జేఎంఎం పార్టీపై ఈడీ దాడులు జరుగుతున్నాయి. నేరుగా సీఎం ఇంట్లోనే సోదాలు చేస్తున్నారు. అందుకేం బీజేపీ ఏదైనా చేయాలనుకుంటే చేస్తుందని.. రాష్ట్రపతి ఎన్నికల్లాంటి ముహుర్తాలు పెట్టుకోదని ఇంకొద్దరు వాదిస్తున్నారు. ఏది ఏమైనా రాష్ట్రపతి ఎన్నికల తర్వాత బీజేపీ దూకుడు పెంచడం ఖాయమన్న అభిప్రాయం ఇటు బీజేపీ నేతల్లో, అటు టీఆర్‌ఎస్ నేతల్లో వ్యక్తమవుతోంది.
Also Read:Coronavirus in India: మరోసారి కరోనా పంజా.. ఈసారి తట్టుకోవడమే కష్టమేనా?
[…] […]
[…] […]