YSRCP Plenary 2022: వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ తొలిరోజు చప్పగానే సాగింది. ఎలాంటి హంగులు, ఆర్బాటాలు లేకుండానే ముగిసింది. తాము అధికారంలోకి రావడానికి సహకరించిన పరిస్థితులు, రాబోయే ఎన్నికల్లో చేపట్టాల్సిన వ్యూహాలేవి తెలియజేయకుండానే ప్లీనరీని తొలిరోజు మమ అనిపించారు. దీంతో నేతలు, కార్యకర్త్లల్లో నైరాశ్యం నెలకొంది. ఎన్నో ఆశలతో మరెన్నో ఊహలతో ప్లీనరీ సాగుతుందని భావించినా చేదు అనుభవమే ఎదురైంది. మొత్తంగా విజయమ్మ రాజీనామానే పెద్ద అస్త్రంగా కనిపించింది.

విజయమ్మ రాజీనామా చేస్తారని ఎవరు ఊహించి ఉండరు. ఒకవేళ ఊహిస్తే ఆమెను స్టేజీ మీదకు రానివ్వరు. కానీ ఆమె మొదట రాసుకున్న ప్రసంగం చదివి తరువాత తన మదిలోని అంశాలను బహిర్గతం చేయడం సంచలనం సృష్టిస్తోంది. తన కూతురు షర్మిల కోసమే తాను వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా ఉండటం లేదని సభా ముఖంగా ప్రకటించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో విజయమ్మ పార్టీని వీడటం ఎవరికి ఇష్టం లేదు. కానీ ఆమె సభా వేదిక మీదే ప్రకటన చేయడంతో ఎవరు ఎదురు చెప్పలేకపోయారు.
Also Read: BJP Mission South India: ప్రెసిడెంట్ ఎన్నికల తర్వాతనే ‘దక్షిణం’పై దండయాత్ర
ఇన్నాళ్లు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నా ఆమెకు ఒరిగిందేమీ లేదు. దీంతోనే ఆమెకు ఆగ్రహం వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె మాత్రం తన కూతురు షర్మిల కోసమే వైసీపీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో వైఎస్సార్ టీపీ స్థాపించి షర్మిల పాదయాత్ర నిర్వహిస్తోంది. దీంతో ఆమె వెంట ఉండేందుకే నిర్ణయించుకున్న సందర్భంలో వైసీపీకి గుడ్ బై చెబుతున్నట్లు చెప్పడం గమనార్హం. ఈ క్రమంలో ఇప్పుడు జగన్ ప్రతిపక్షాలకు ఏం సమాధానం చెబుతారు? తల్లి, చెల్లిని ప్రేమించలేని సీఎం అంటూ ప్రతిపక్షాలు గోల చేసేందుకు రెడీ అవుతున్న కారణంగా జగన్ కు చిక్కే వచ్చి పడింది.

ఎవరు కూడా ప్లీనరీ గురించి చర్చించుకోలేదు. కానీ విజయమ్మ రాజీనామా విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. వైసీపీకి భవిష్యత్ లో కష్టాలే అని తెలుస్తోంది. దీంతో పార్టీ భవితవ్యం డోలాయమానంలో పడనుంది. నేతల్లో కూడా అయోమయం నెలకొంది. రానున్న రోజుల్లో పార్టీకి విజయం దక్కడం అంత సులభం కాదనే విషయం స్పష్టమవుతోంది. ఇక ప్లీనరీ విషయంలో నేతల్లో పెద్ద ప్రాధాన్యం కనిపించలేదు. ఏదో నామ్ కే వాస్తుగా వచ్చారా వెళ్లారా అనే కోణంలో చూశారనే విషయం తేటతెల్లం అవుతోంది. దీంతో వైసీపీకి రాబోయే రోజుల్లో అధికారం సొంతం కావడమంటే మాటలు కాదనే తెలుసుకున్నట్లు సమాచారం.