ఆంధ్రప్రదేశ్‌గురుమూర్తిని టార్గెట్‌ చేసిన బీజేపీ

గురుమూర్తిని టార్గెట్‌ చేసిన బీజేపీ

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ దూసుకెళ్తోంది. కొత్త కొత్త విషయాలను వెలుగులోకి తెస్తూ తమ ప్రచారాన్ని ముమ్మరంగా నడిపిస్తున్నారు. తాజాగా.. వైఎస్సార్‌‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గురుమూర్తిని టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేశారు. విమర్శలు కాదు.. ఏకంగా ఆయన బయోగ్రఫినే బయటపెట్టేశారు. ఈ ఆరోపణలతో ఒక్కసారిగా వైసీపీ నేతలందరూ ఆలోచన పడిపోయారు. ఈ ఆరోపణల నుంచి ఇప్పుడు ఎలా బయటపడాలని ఆలోచిస్తున్నారు.

వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ఒక్కసారి కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకోలేదని సంచలన విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. అంతేకాదు.. ఆయన వేంకటేశ్వరస్వామిని దర్శించుకుపోగా.. చర్చిలకు వెళ్లి ప్రార్థనలు చేసినట్లు వెల్లడించారు. నామినేషన్‌ వేసే ముందు కూడా చర్చిలో ప్రార్థనలు చేశారని.. ఈ మేరకు ఫొటోలు కూడా బయటపెట్టేశారు.

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజే ఈ ఆరోపణలన్నింటినీ వెలుగులోకి తెచ్చారు. గురుమూర్తి మీద మొదటి నుంచి ఆయన ప్రత్యేక ఫోకస్‌ పెట్టారు. సందర్భం దొరికినప్పుడల్లా గురుమూర్తిపై విరుచుకుపడుతూనే ఉన్నారు. ఇక తాజాగా.. ఆయన తిరుమల దేవస్థానాన్ని దర్శించుకోలేదనే సంచలనం విషయాన్ని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. గురుమూర్తి క్రిస్టియన్‌ అని.. ఎస్సీ రిజర్వేషన్‌ కేటగిరి నుంచి పోటీ చేసేందుకు అనర్హుడంటూ ఆరోపించారు. మతం మార్చుకున్న వారికి రిజర్వేషన్లు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు.

అయితే.. గురుమూర్తి మతం మార్చుకున్నాడని నిరూపించడం బీజేపీ పెద్ద విషయమేమీ కాదు. కానీ.. ఇప్పుడు అలా నిరూపించడం కంటే ఆయన క్రిస్టియన్‌ అని ప్రచారం చేసి ఎన్నికలో లబ్ధిపొందాలని బీజేపీ ప్లాన్‌ చేస్తోంది. టెంపుల్‌ సిటీ అయిన తిరుపతి కేంద్రంగా ఓ క్రిస్టియన్‌ లోక్‌సభకు వెళ్తే తిరుపతికి ఏమాత్రం సెక్యూరిటీ కాదని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

AP BJP: ఏపీ బీజేపీ చీఫ్ ఆయనే.. సోము వీర్రాజు ఎంట్రీ తో మారిన సీన్

AP BJP రెండేళ్ల కిందట ఏపీ బీజేపీ చీఫ్ గా పురందేశ్వరి( AP BJP Chief purandeswari ) నియమితులయ్యారు. ఆమె నేతృత్వంలో 2024 ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించింది భారతీయ జనతా పార్టీ.

Somu Veerraju: యాక్షన్ లోకి సోము వీర్రాజు.. మైక్ కనిపిస్తే జగనే టార్గెట్!

Somu Veerraju ఎవరు అవునన్నా కాదన్నా.. సోము వీర్రాజు తెలుగుదేశం( Telugu Desam) పార్టీని తీవ్రంగా వ్యతిరేకించేవారు. ఆయన ఏపీ బీజేపీ చీఫ్ గా ఉన్న సమయంలో అధికార పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉండేది.

Most Popular

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....
Exit mobile version