డబ్బును రెట్టింపు చేసే పోస్టాఫీస్ స్కీమ్స్ ఇవే.. లక్షల్లో రాబడి..?

మనలో చాలామంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బును సంపాదించాలని భావిస్తూ ఉంటారు. అలా భావించే వాళ్లు పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సులభంగా మంచి లాభాలను పొందే అవకాశం ఉంటుంది. పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎలాంటి రిస్క్ లేకుండానే డబ్బులు డబుల్ అవుతాయి. పోస్టాఫీస్ కస్టమర్లకు ఆఫర్ చేస్తున్న స్కీమ్ లలో టైమ్ డిపాజిట్ స్కీమ్ ఒకటి. సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల టైమ్ డిపాజిట్లకు 5.5 […]

Written By: Navya, Updated On : April 14, 2021 6:39 pm
Follow us on

మనలో చాలామంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బును సంపాదించాలని భావిస్తూ ఉంటారు. అలా భావించే వాళ్లు పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సులభంగా మంచి లాభాలను పొందే అవకాశం ఉంటుంది. పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎలాంటి రిస్క్ లేకుండానే డబ్బులు డబుల్ అవుతాయి. పోస్టాఫీస్ కస్టమర్లకు ఆఫర్ చేస్తున్న స్కీమ్ లలో టైమ్ డిపాజిట్ స్కీమ్ ఒకటి.

సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల టైమ్ డిపాజిట్లకు 5.5 శాతం వడ్డీరేటు లభిస్తోంది. ఐదేళ్ల టైమ్ డిపాజిట్లకు 6.7 శాతం వడ్డీ లభిస్తుండగా 10.75 సంవత్సరాలలో డబ్బు రెట్టింపు అయ్యే అవకాశాలు ఉంటాయి. పోస్టాఫీస్ కస్టమర్లకు ఆఫర్ చేస్తున్న స్కీమ్ లలో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే 12.4 సంవత్సరాలలో డబ్బు రెట్టింపు అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం ఈ స్కీమ్ పై 5.8 శాతం వడ్డీ లభిస్తోంది.

నెలకు కనీసం 100 రూపాయల నుంచి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. పోస్టాఫీస్ ఆఫర్ చేస్తున్న స్కీమ్ లలో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కూడా ఒకటి కాగా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా 6.6 శాతం వడ్డీని పొందే అవకాశం ఉంటుంది. కనీసం 1000 రూపాయలతో సులభంగా ఈ స్కీమ్ లో చేరే అవకాశాలు ఉంటాయి. ఈ స్కీమ్ లో చేరిన వాళ్లకు 10.9 సంవత్సరాలలో డబ్బు రెట్టింపు అయ్యే అవకాశాలు ఉంటాయి.

పోస్టాఫీస్ ఆఫర్ చేస్తున్న స్కీమ్ లలో నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ కూడా ఒకటి కాగా ఈ స్కీమ్ లో 6.8 శాతం వడ్డీ లభించడంతో పాటు 10.59 ఏళ్లలో డబ్బు రెట్టింపు అవుతుంది. ఆడపిల్లలకు ప్రయోజనం చేకూర్చడం కోసం కేంద్రం అమలు చేస్తున్న సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే 9.47 ఏళ్లలో డబ్బు రెట్టింపు అవుతుంది. ఈ స్కీమ్ పై ఏకంగా 7.6 శాతం వడ్డీరేటు లభిస్తోంది.