కేంద్రంలో బిజెపి సారధ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎంత ప్రతిష్టాకరంగా పౌరసత్వ సవరణ చట్టం తీసుకు రావడంతో పాటు ఎన్‌ఆర్‌సీల అమలుకు సుఖంగా ఉండటం తెలిసందే. వీటిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలో అసెంబ్లీలు తీర్మానాలు చేస్తున్నాయి.
కానీ, మహారాష్ట్రలో బీజేపీ పాలిత మున్సిపల్ కౌన్సిల్ ఈ రెండింటినీ వ్యతిరేకిస్తూ తీర్మానం ఆమోదించింది. ఈ వార్త బీజేపీ అధినాయకత్వాన్ని కలవరపరిచింది. బిజెపి నేతలు అవాక్కైయ్యారు.
బిజెపికి చెందిన ఔరంగాబాద్ మునిసిపల్ చైర్మన్ వినోద్ బొరాడే స్వయంగా ఈ తీర్మానాన్ని ఆమోదించిన విషయాన్నీ వెల్లడించారు. ఫిబ్రవరి 28న ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదించినట్లు ఆయన తెలిపారు.
సమావేశం ప్రారంభంకాగానే ఎన్‌సీపీ, కాంగ్రెస్‌కు చెందిన ఏడుగురు సభ్యులు సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని ప్రతిపాదించారని, దీనికి స్థానిక ప్రజాప్రతినిధులూ మద్దతు పలికారని ఆయన వివరించారు.
నగర పరిషత్‌లో 27 మంది కౌన్సిలర్లు, ముగ్గురు కో-ఆప్టెడ్ సభ్యులున్నారని ఆయన తెలిపారు. ఈ తీర్మానాన్ని ఎవరూ వ్యతిరేకించలేదని, ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందని ఆయన వివరించారు.