నేడు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జన్మదినం. మంగళవారం నాటికి ఈ భామ 33వ వసంతంలోకి అడుగుపెడుతోంది. దీంతో ముద్దుగుమ్మకు పలువురు సీని ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా హీరో ప్రభాస్ ‘నా స్వీటెస్ట్ అమృత’ అంటూ శ్రద్ధాకపూర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ `సాహో` సినిమాతో దక్షిణాదివారికి పరిచమైంది. ‘సాహో’ సినిమాలో యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ పక్కన జోడీగా నటించింది. ‘సాహో’ మూవీలో ప్రభాస్, శ్రద్ధాకపూర్ జోడికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘సాహో’ తెలుగులో అనుకున్నంత విజయం సాధించకపోయినా హిందీలో మాత్రం ఘన విజయం సాధించింది.
సాధారణంగా సోషల్ మీడియాకు ప్రభాస్ దూరంగా ఉంటాడు. అయితే శద్ధాకపూర్ పుట్టిన రోజు మాత్రం ఆమెకు ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా విషెస్ చెప్పి సర్ ప్రైజ్ చేశాడు. ‘నా స్వీటెస్ట్ అమృత (`సాహో`లో శ్రద్ధ పాత్ర పేరు)కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు చెప్పాడు. అలాగే `సాహో` సినిమాలోని స్టిల్‌ను షేర్ చేశాడు. శ్రద్ధాకపూర్ ప్రస్తుతం ‘బాగీ-3’ మూవీలో నటిస్తుంది.