BJP Parthasarathi: మోడీ గురించి జగనే ఒప్పుకున్నాడు..వైసీపీని ఇరికించిన పార్థసారథి

BJP Parthasarthi: ఇన్నాళ్లు ఏపీ అధికార వైసీపీ నేతలు ఒకటే కూత కూశారు. ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తోందని.. ప్రత్యేక హోదా సహా ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆడిపోసుకున్నారు. కానీ నాణేనికి మరో వైపు మాత్రం ఇదంతా అబద్ధం అని ఏపీ సీఎం జగన్ నోటి నుంచే వినిపించింది. ఇప్పుడు దీన్నే బీజేపీ ఎలుగెత్తి చాటుతోంది. తాజాగా బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి పార్థసారథి వైసీపీని లాజిక్ తో కొట్టాడు. వైసీపీ అసత్య ప్రచారానికి చెక్ […]

Written By: NARESH, Updated On : February 18, 2022 6:46 pm
Follow us on

BJP Parthasarthi: ఇన్నాళ్లు ఏపీ అధికార వైసీపీ నేతలు ఒకటే కూత కూశారు. ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తోందని.. ప్రత్యేక హోదా సహా ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆడిపోసుకున్నారు. కానీ నాణేనికి మరో వైపు మాత్రం ఇదంతా అబద్ధం అని ఏపీ సీఎం జగన్ నోటి నుంచే వినిపించింది. ఇప్పుడు దీన్నే బీజేపీ ఎలుగెత్తి చాటుతోంది.

తాజాగా బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి పార్థసారథి వైసీపీని లాజిక్ తో కొట్టాడు. వైసీపీ అసత్య ప్రచారానికి చెక్ పెట్టాడు. ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తోందన్న ఆరోపణలను తిప్పి కొట్టాడు. అవిప్పుడు వైరల్ గా మారాయి.ఇటీవల విజయవాడకు వచ్చిన కేంద్ర జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఏపీలో 21వేల కోట్ల విలువైన జాతీయ రహదారులకు శంకుస్థాపన చేశారు. సీఎం జగన్ సైతం కేంద్రం చేస్తున్న ఈ సాయాలను వేయినోళ్ల పొగిడారు. రాబోయే 2024 సంవత్సరంలో 3 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఆంధ్రప్రదేశ్ లో జాతీయ రహదారులు నిర్మించడానికి కేంద్రం సంసిద్ధంగా ఉందని నితిన్ గడ్కరీ సంచలన ప్రకటన చేశారు. అవన్నీ తొందరగా పూర్తవుతాయన్నారు. దాన్నే పార్థసారతి గుర్తూ చేస్తూ వైసీపీ నేతల ఆరోపణలను ఖండించారు.

దీనికి సీఎం జగన్ సైతం స్వాగతించారు. ప్రధాని మోడీ ముందు చూపు వల్ల ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి సాగుతుందని పేర్కొన్నారు. దీన్ని హర్షిస్తుందన్నారు.దీనిపై పార్థసారథి సూటిగా ప్రశ్నించారు. కేంద్రం ఏపీపై వివక్ష చూపుతుందన్న వైసీపీ నేతల మాటలకు అవన్నీ కాదని సాక్షాత్తూ సీఎం జగన్ యే తన మాటలతో క్లారిటీ ఇచ్చారని పార్థసారతి వివరణ ఇచ్చారు.

ఏది ఏమైనా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పర్యటనతో ఒక్కటి అయితే తేలిపోయింది. ఏపీపై కేంద్రం వివక్ష చూపడం లేదని తేలింది. స్వయంగా సీఎం జగన్ నోటి వెంట ఇది రావడంతో వైసీపీ నేతల నోట్లో పచ్చి వెలక్కాయపడ్డ చందంగా మారింది. బీజేపీ పాలన గురించి.. మోడీ చేస్తున్న అభివృద్ధి గురించి జగన్ చెప్పడాన్ని పార్థసారథి స్వాగతించారు.

ఇంకో విషయం కూడా సీఎం జగన్ చెప్పిన దాంట్లో లాజిక్ తీశారు పార్థసారథి. 2014లో ఏపీలో కేవలం రోజుకు 12 కి.మీలు రోడ్లు వేస్తే.. ఈరోజు 2022లో 37 కి.మీలు ఒక్కరోజులో నిర్మిస్తున్నారని లెక్కలు బయటకు తీశారు. 2014 లో 4వేల కి.మీల జాతీయ రహదారి ఉంటే.. ఈరోజు 8200 కి.మీలు జాతీయ రహదారిని కేంద్రం నిర్మించిందని సీఎం జగన్ చెప్పారు. దీన్ని బట్టే కేంద్రం ఏపీపై వివక్ష చూపించడం లేదని పార్థసారథి చెప్పుకొచ్చారు.

అయితే కేంద్రం ఇంత చేస్తుంటే.. రాష్ట్రాల రహదారులు అధ్వానంగా ఉందని.. కర్నూలులో అయితే జగన్ సీఎం అయ్యాక కొత్త రహదారులే నిర్మించలేదని.. ఉన్న రహదారులకు కూడా గుంతలు పూడ్చడం లేదని పార్థసారథి విమర్శించారు.

Tags