
మరికొద్ది రోజుల్లో తిరుపతి లోక్‌సభ స్థానానికి బై ఎలక్షన్లు జరగబోతున్నాయి. దీంతో ఈ స్థానాన్ని అన్ని పార్టీలూ చాలెంజ్‌గా తీసుకున్నాయి. అధికార పార్టీ సిట్టింగ్ స్థానం కాబట్టి చేజార్చుకోవద్దని పట్టుదలతో ఉంది. ఇక బీజేపీ కూడా అదే స్థాయిలో పోరాడుతోంది. అంతేకాదు.. మరో అడుగు ముందుకేసి ఇప్పుడు కొత్త రాగం అందుకుంది. తిరుపతిలో బీజేపీ క్యాండిడేట్‌ను గెలిపిస్తే కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటామని చెబుతోంది. కేంద్ర మంత్రి అయితే తిరుపతికి దండిగా ఫండ్స్ తీసుకురావచ్చని ప్రగల్బాలు పలుకుతున్నారు. ఇదే వ్యూహాన్ని బీజేపీ ఖరారు చేసుకున్నట్లుగా సమాచారం.
Also Read: మున్సిపల్ ఫలితాల్లో వైసీపీ ప్రభజనం.. 15 మున్సిపాల్టీలు కైవసం.. బోణి కొట్టని టీడీపీ
ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి గడ్డుకాలం నడుస్తోంది. విభజన హామీలు ఏమీ అమలు చేయకపోగా.. పోలవరం లాంటి ప్రాజెక్టులు అమరావతి, విశాఖ స్టీల్ ఇలా అన్నీ వరుసగా శిథిలం చేస్తున్నారన్న అసహనం బీజేపీ నేతలపై ఉంది. ఇలాంటి క్రమంలో.. బీజేపీ ఇప్పుడు కేంద్రంలో తమకు ఉన్న అధికారాన్నే చూపించి.. ఓట్ల వేట సాగించాలని నిర్ణయించుకుంది. అందుకోసం కేంద్ర మంత్రి పదవి అనేది తిరుపతి ప్రజలకు తాయిలంగా వేస్తోంది. ఏపీ నుంచి ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌లో ప్రాతినిధ్యం లేదు.
Also Read: గంటా కొత్త స్కెచ్.. బీజేపీ నుంచి పవన్‌ను దూరం చేయడమే టార్గెట్
సహజంగా కేంద్ర కేబినెట్ అంటే ప్రతీ రాష్ట్రానికి చెందిన ఒక ఎంపీకి చాన్స్ ఇస్తుంటారు. అయితే.. ఏపీ అంటే నిర్లక్ష్యమో లేక బీజేపీకి అంతగా పట్టులేదని అనుకున్నారో కానీ.. ఒక్కరంటే ఒక్కరికి కూడా కేంద్రమంత్రి పదవి ఇవ్వలేదు. కేరళకు.. తెలంగాణకు కూడా కేంద్ర మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం ఉంది. కానీ.. ఏపీ నుంచి కల్పించలేదు. ఇప్పుడు ఏపీ నుంచి ప్రాతినిధ్యం కావాలంటే.. బీజేపీ ఎంపీని గెలిపించాలని ఆ పార్టీ నేతలు కోరబోతున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
రిజర్వుడు నియోజకవర్గం కావడం.. పార్టీలో పేరొందిన దళిత నేతలెవరూ లేకపోవడంతో.. రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారులపై దృష్టి సారించారు. కర్ణాటక మాజీ సీఎస్ రత్నప్రభ పేరు ఎక్కువగా వినిపించింది. కానీ ఆమె తిరస్కరించారేమో కానీ.. దాసరి శ్రీనివాసులు అనే రిటైర్డ్ అధికారి పేరు ఇప్పుడు వినిపిస్తోంది. బీజేపీ గతంలో టీడీపీ మద్దతుతో ఓ సారి పార్లమెంట్ స్థానం గెలుచుకుంది. ఒంటరిగా పోటీ చేసినప్పుడు కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు ఎలాగైనా రాష్ట్రంలో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ.. దుబ్బాక, గ్రేటర్ తరహాలో ప్రత్యామ్నాయంగా ఎదగాలన్న పట్టుదలతో ఉంది. జనసేన మద్దతు అదనపు బలమని.. తాము గట్టి పోటీ ఇస్తామన్న నమ్మకంతో ఉన్నారు.
Comments are closed.