
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకం అయ్యాక పార్టీకి ఏ స్థాయిలో ఊపు వచ్చిందో అందరికీ తెలిసిందే. తన తెగాయింపు.. తన మాటలతో.. తన చాతుర్యంతో పార్టీకి ఇప్పుడు రాష్ట్రంలో హైప్ తెచ్చారు. ఒకవిధంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఇప్పుడు టీఆర్‌ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయం అయింది. ఈ క్రెడిట్ అంతా కూడా బండి సంజయ్‌దే అనడంలోనూ ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఆ సంజయ్‌ని బర్నాం చేసేందుకు సోషల్ మీడియా ప్రయత్నం చేస్తోంది.
Also Read: డ్రగ్స్ కేసులో నోటీస్ పై స్పందించిన హీరో తనీష్
కొంత మంది నెట్‌వర్క్‌గా ఏర్పడి విస్తృతమైన ఫేక్ వార్తలను వైరల్ చేస్తున్నారు. ఆయనకు రూ.ఆరు వందల కోట్ల ఆస్తులున్నాయని.. గ్రానైట్ వ్యాపారులను బెదిరించి పెద్ద ఎత్తున సంపాదించారని సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ నేరుగా ఆయా రాజకీయ పార్టీలు లేదా వ్యక్తులు చేసి ఉంటే.. దానికి బండి సంజయ్ సమాధానం ఇచ్చేవారు. కానీ.. అలా ప్రచారం చేస్తున్న వారందరూ.. ప్రముఖ మీడియా సంస్థల లోగోలను ఫేకింగ్ చేసి.. ఆయా చానళ్లు, పత్రికల్లో వచ్చినట్లుగా మార్ఫింగ్ చేసి మరీ ప్రచారం చేస్తున్నారు. దాంతో వాటిని ప్రజలు నమ్ముతారేమో అన్న ఆందోళన బండి సంజయ్‌తో పాటు బీజేపీలోని ఆయన వర్గంలో ప్రారంభమైందిది.
Also Read: తిరుపతి ఉప ఎన్నిక రేసులో ఆ నలుగురు
టీవీ9తో పాటు బీజేపీ సపోర్ట్‌గా ఉంటుందని పేరున్న ‘వెలుగు’ పేపర్ సహా అన్ని మీడియా సంస్థలను టార్గెట్‌గా వాడేశారు. విస్తృతంగా సర్క్యులేట్ చేశారు. మొదట్లో కాస్తే తేలిగ్గా తీసుకున్న బీజేపీ.. తర్వాత విపరీతంగా ప్రచారం అవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ.. ప్రయోజనం లేకపోవడంతో.. నేరుగా కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. అప్పటికే జరగాల్సిన ప్రచారం మాత్రం జరిగిపోయింది. ఈ ప్రచారాన్ని ఎవరు చేశారో.. చేయిస్తున్నారో కూడా బీజేపీ నేతలు గుర్తించలేకపోతున్నారు. బండి సంజయ్ పై బీజేపీలోని ఓ వర్గం గుర్రుగా ఉందని కొంత మంది టీఆర్ఎస్ అధినేతపై దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారన్న కారణంగా టీఆర్ఎస్ నేతలే ఆయనపై ఇలా ప్రచారం చేయిస్తున్నారని మరికొంత మంది అనుమానిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
రాజకీయ నేతల ఆస్తుల ప్రకారం చూస్తే బండి సంజయ్ నిరుపేద కిందనే లెక్క. ఆయన ఎప్పుడూ పదవిలో లేరు. కేవలం ఒక కార్పొరేటర్. ఎన్నోసార్లు ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ టర్మ్‌లో మాత్రం ఎంపీ ఎన్నికల్లో గెలిచారు. డబ్బులు సంపాదించే పదవుల్లో ఎప్పుడూ లేరు. అయితే బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత ఆయన సంపాదించారని వీరు ప్రచారం చేస్తున్నారు. తనకు ఆ ఆస్తులు ఉంటే చూపించాలని.. ఆయన నేరుగానే సవాల్ చేస్తున్నా ఫేక్ ప్రచారం చేస్తున్న వారు స్పందిచడం లేదు. వారు తమ పని తాము కానిచ్చేస్తున్నారు.
Comments are closed.