ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎప్పుడైతే సోము వీర్రాజు బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుంచి ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. వీలు దొరికినప్పుడల్లా ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీస్తూనే ఉన్నారు. సమస్యలపై ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే.. తాజాగా.. ‘వైఎస్సార్ జగనన్న భూహక్కు భూ రక్ష’ పథకంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేతలు.
Also Read: జమిలీకి మోడీ సై.. అన్ని పార్టీలు ఓకే అనాల్సిందేనా..
ముఖ్యంగా ఈ పథకంపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. పుట్టిన రోజే అబద్ధాలా అంటూ ట్వీట్ చేశారు. ‘పుట్టినరోజే అబద్ధాలా?. ప్రజల స్థలాల రక్షణ, భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం ‘స్వామిత్వ’ పథకం ప్రవేశపెడితే… జగన్ గారు…! మీ ప్రభుత్వం పేరు మార్చి ‘వైయస్సార్ జగనన్న భూహక్కు-భూ రక్ష’ ప్రారంభోత్సవం చేయడం ఏంటి? పేర్లు మార్చి ప్రజలను ఎన్నాళ్లు ఏమార్చగలరు. కనీసం ప్రధాని ఫొటో పెట్టరా?’ అంటూ విష్ణువర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు.
మరోవైపు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా విరుచుకుపడ్డారు. కేంద్రం పథకాలను పేరు మార్చి రాష్ట్ర ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోందని ఆరోపించారు. కేంద్రం ప్రవేశపెట్టిన స్వామిత్ర (ప్రాపర్టీ కార్ట్) పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు పత్రంగా పేరు మార్చింది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డబుల్ స్టిక్కర్ ప్రభుత్వంగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. 108, 104 పథకాలకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు ఇస్తే మోదీ బొమ్మ బదులు జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
Also Read: ఢిల్లీకి కోమటిరెడ్డి..ఈ ఇద్దరిలో ఒకరు పీసీసీ చీఫ్
ఓ వైపు జగన్ కేంద్రంతో దోస్తీ కడుతుంటే.. రాష్ట్రంలో మాత్రం అదే బీజేపీ నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. జగన్ ఏ స్కీం అమల్లోకి తెస్తున్నా ఇన్నాళ్లు టీడీపీ మోకాలడ్దేది. కానీ.. అదేంటో ఇప్పుడు బీజేపీ నెత్తిన వేసుకుంటోంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలనే బీజేపీ ప్రయత్నమే ఇందుకు నిదర్శనమని రాజకీయ వర్గాల్లో టాక్.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్