https://oktelugu.com/

బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. మూడు రోజులు సెలవులు..?

బ్యాంకుల్లో తరచూ లావాదేవీలు జరిపే వాళ్లు బ్యాంకు సెలవుల గురించి తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలి. లేకపోతే ముఖ్యమైన లావాదేవీలు జరిపే సమయంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 2020 సంవత్సరంలో ఇంకా 9 రోజులే ఉండగా ఈ 9 రోజులలో వరుసగా మూడు రోజులు బ్యాంకు సెలవులు ఉన్నాయి. ఈ సెలవు రోజుల గురించి తప్పనిసరిగా అవగాహన ఉంటే అత్యవసరమైన పనులు ముందుగానే చక్కబెట్టుకోవచ్చు. Also Read: 9 నెలల తరువాత షాప్ తెరిచి షాకైన వ్యాపారి.. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 22, 2020 / 02:36 PM IST
    Follow us on

    బ్యాంకుల్లో తరచూ లావాదేవీలు జరిపే వాళ్లు బ్యాంకు సెలవుల గురించి తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలి. లేకపోతే ముఖ్యమైన లావాదేవీలు జరిపే సమయంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 2020 సంవత్సరంలో ఇంకా 9 రోజులే ఉండగా ఈ 9 రోజులలో వరుసగా మూడు రోజులు బ్యాంకు సెలవులు ఉన్నాయి. ఈ సెలవు రోజుల గురించి తప్పనిసరిగా అవగాహన ఉంటే అత్యవసరమైన పనులు ముందుగానే చక్కబెట్టుకోవచ్చు.

    Also Read: 9 నెలల తరువాత షాప్ తెరిచి షాకైన వ్యాపారి.. ఏం జరిగిందంటే..?

    ఈ నెల 25వ తేదీన క్రిస్మస్ పండుగ అనే సంగతి తెలిసిందే. పండుగ కావడం వల్ల 25వ తేదీన దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. ప్రతి నెలలో బ్యాంకులకు రెండో శనివారం, నాలుగో శనివారం సెలవు దినం కాగా ఈ నెలలో 26వ తేదీ నాలుగో శనివారంగా ఉంది. అందువల్ల 26వ తేదీన కూడా బ్యాంక్ లావాదేవీలను జరపడం సాధ్యం కాదు. డిసెంబర్ 27వ తేదీన ఆదివారం కావడంతో ఆరోజు కూడా బ్యాంకులకు సెలవు దినంగా ఉంది.

    Also Read: ఎస్బీఐ సంచలన నిర్ణయం.. ఇతర బ్యాంకుల కస్టమర్లకు శుభవార్త..?

    వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో నగదు అవసరమైనా, ఇతరత్రా పనులు ఉన్నా ముందే చేస్తే మంచిది. సెలవు రోజుల్లో ఏటీఎంలలో సైతం నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తూ ఉంటాయి. అందువల్ల ముందుగానే ఖర్చులకు సరిపడే డబ్బులు ఉంచుకుంటే మంచిది. మళ్లీ డిసెంబర్ 28వ తేదీ నుంచి బ్యాంకులు యథాతథంగా పని చేస్తాయి. పన్ను చెల్లింపుదారులకు ఈ నెల 31వ తేదీ ఐటీఆర్ రిటర్నులు దాఖలు చేయడానికి చివరి తేదీగా ఉంది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    అందువల్ల పన్ను చెల్లింపుదారులు సైతం చివరి నిమిషంలో కంగారు పడకుండా ముందుగానే ఐటీ రిటర్న్ లను దాఖలు చేస్తే మంచిది. ఇయర్ ఎండింగ్ కావడంతో షాపింగ్, ఇతరత్రా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఇబ్బందులు పడకుండా జాగ్రత్త పడవచ్చు.