https://oktelugu.com/

Pankaj Singh: దేశంలోనే అత్యధికం..ఈయనకు 1.79 లక్షల ఓట్ల మెజారిటీ

Pankaj Singh: దేశంలో అయిదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. గురువారం ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో భారతీయ జనతా పార్టీ, ఆప్ లు విజయదుందుబి మోగించాయి. బీజేపీ ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్, మణిపూర్, గోవాలో విజయం సాధించగా ఆప్ పంజాబ్ లో సత్తా చాటింది. దీంతో ఓటర్ల తీర్పుతో అందరు ఖంగుతిన్నారు. బీజేపీపై వ్యతిరేకత పెరిగిందని ఇక అధికారం రావడం కలేననే వాదనలు కూడా వినిపించాయి. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ బీజేపీ అప్రతిహ విజయయాత్ర కొనసాగించింది. మోడీ-అమిత్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 11, 2022 / 09:51 AM IST
    Follow us on

    Pankaj Singh: దేశంలో అయిదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. గురువారం ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో భారతీయ జనతా పార్టీ, ఆప్ లు విజయదుందుబి మోగించాయి. బీజేపీ ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్, మణిపూర్, గోవాలో విజయం సాధించగా ఆప్ పంజాబ్ లో సత్తా చాటింది. దీంతో ఓటర్ల తీర్పుతో అందరు ఖంగుతిన్నారు. బీజేపీపై వ్యతిరేకత పెరిగిందని ఇక అధికారం రావడం కలేననే వాదనలు కూడా వినిపించాయి. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ బీజేపీ అప్రతిహ విజయయాత్ర కొనసాగించింది. మోడీ-అమిత్ షా ద్వయానికి తిరుగులేదని ఈ ఫలితాలు నిరూపించాయి. దీంతో 2024 ఎన్నికల్లోనూ బీజేపీదే విజయం అనే ధీమా అందరిలో వ్యక్తమవుతోంది.

    Pankaj Singh

    బీజేపీ తిరుగులేని మెజార్టీ సాధించింది. యూపీలో అత్యధిక స్థానాలు గెలుచుకుని సమాజ్ వాదీ పార్టీని రెండో స్థానానికే పరిమితం చేసింది. ఈ నేపథ్యంలో యూపీలోని అసెంబ్లీ ఎన్నికల్లో నోయిడా నుంచి బరిలో దిగిన బీజేపీ అభ్యర్థి పంకజ్ సింగ్ అఖండ మెజార్టీ సాధించారు. ఆయన సమీపఅభ్యర్థి ఎస్పీ పార్టీకి చెందిన నేతపై ఏకంగా 1.79 లక్షల మెజార్టీ సాధించి అందరిని ఆశ్చర్య పరచారు. ఇంత భారీ స్తాయిలో మెజార్టీ రావడం ఆశ్చర్యకరమే. సమీప అభ్యర్థి కేవలం 26 వేల ఓట్లు సాధించడం గమనార్హం. దేశంలోనే అత్యధిక మెజార్టీ సాధించడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆయనపై పడింది.

    Also Read: రాధేశ్యామ్ కు చివరి నిమిషంలో గుడ్ న్యూస్

    దీన్ని బట్టి బీజేపీకి ఆదరణ తగ్గలేదని తెలుస్తోంది. ఇంకా పెరిగిందనే చెప్పాలి. గతం కంటే కొన్ని సీట్లు తగ్గినా మెజార్టీ మాత్రం స్పష్టంగా వచ్చింది. దీంతో కమలనాథుల్లో జోష్ పెరుగుతోంది. ఇదే ఊపుతో రాబోయే ఎన్నికల్లోనూ విజయదుందుబి మోగించి మూడోసారి అధికారం హస్తగతం చేసుకోవాలని భావిస్తోంది. మోడీ-అమిత్ షా ద్వయం సృష్టించిన ప్రభంజనానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఏకంగా నాలుగు రాష్ట్రాల్లో తిరుగులేని విధంగా సీట్లు తెచ్చుకుని బీజేపీ ప్రతిష్ట రెట్టింపు చేసుకుంది. ప్రతిపక్షాలకు మరోమారు సవాలు విసిరింది. కాంగ్రెస్ మాత్రం చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు అయింది.

    Pankaj Singh

    మరోవైపు బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఆప్ ఎదుగుతోందని రాజకీయ విశ్లేషకులుచెబుతున్నారు. ఢిల్లీ నుంచి మెల్లగా పంజాబ్ కు విస్తరించిన ఆప్ కాంగ్రెస్ ను మట్టికరిపించి అధికారం దక్కించుకుంది. దీంతో రాబోయే రోజుల్లో కూడా మిగతా రాష్ట్రాలకు కూడా విస్తరించే యోచనలో కేజ్రీవాల్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆప్ విధానాలను ప్రజలు విశ్వసిస్తున్నారు. అందుకే పంజాబ్ లో అధికారం సాధించి పెట్టారు. ఈ నేపథ్యంలో ఆప్ ను దేశవ్యాప్తంగా విస్తరించాలని అధినేత కేజ్రీవాల్ భావిస్తున్నట్లు సమాచారం. పంజాబ్ లో వచ్చిన ఊపుతో మిగతా ప్రాంతాల్లో కూడా ప్రభావం చూపించాలని చూస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే జరిగితే బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఆప్ ఎదిగితే కాషాయనేతలకు కలవరపాటే.

    Also Read: ఆర్ఆర్ఆర్ లో నన్ను ఎందుకు తీసుకోలేదు: ప్రభాస్ ప్రశ్నకు రాజమౌళి షాకింగ్ ఆన్సర్

    Tags