UP Election 2022 Result: బీజేపీ, ఎంఐఎమ్.. ఈ రెండు పార్టీల గురించి అందరికీ తెలిసింది ఒక్కటే. రెండూ బద్ధ శత్రువులు గా మెలుగుతాయి. ఒక పార్టీని ఓడించడానికి మరో పార్టీ ఎత్తుగడలు వేస్తుంది. కానీ ఈ రెండు పార్టీల మధ్య ఉన్న అసలు వ్యవహారం వేరే ఉందని మరోసారి బయటపడిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొదటి నుంచి ఈ రెండు పార్టీల నడుమ ఓ టాక్ ఉంది. ఒక పార్టీని గెలిపించడానికి మరో పార్టీ అక్కడ కావాలనే పోటీ చేస్తుందనే విమర్శలు ఉన్నాయి.
అంతర్గతంగా ఒప్పందాలు ఉన్నాయో లేదో తెలయదు గానీ.. పైన చెప్పినట్టే చాలా సార్లు జరిగింది. ఇప్పుడు యూపీ ఎన్నికల్లో మరోసారి ఇదే విషయం వెల్లడైంది. యూపీలో రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. మొదటి నుంచి ఇక్కడ ఎస్పీ అధికారంలోకి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ బీజేపీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఈ గెలుపు వెనక ఎంఐఎం ఉందని అంటున్నారు చాలామంది.
Also Read: రివ్యూ : ‘రాధేశ్యామ్’
ఎన్నడూ లేని విధంగా ఎంఐఎం పార్టీ యూపీలో 100 స్థానాల్లో పోటీ చేయడం అందరినీ షాక్‌కు గురి చేసింది. అక్కడ కూడా బీజేపీ ఎంఐఎం పార్టీని బూచిగా చూపించి సునాయాసంగా గెలిచిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరీ ముఖ్యంగా ఎంఐఎం వచ్చి సమాజ్‌వాది ఓట్లను చీల్చి అంతిమంగా బీజేపీకి రూట్ క్లియర్ చేసిందంటున్నారు.
నిన్న వచ్చిన ఎన్నికల ఫలితాలను చూస్తుంటే.. ఎస్పీ గతంలో కన్నా ఎక్కువ సీట్లు సాధించింది. బీజేపీ గెలిచిన వంద స్థానాల్లో స్వల్ప మెజార్టీతో ఎస్పీ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. ఆ వంద స్థానాల్లో ఎంఐఎం వల్ల ఎస్పీ ఓట్లు చీలిపోయి ఓడిపోయిందంటున్నారు. మొత్తంగా ఎంఐఎం వల్లనే ఎస్పీ ఓడిపోయిందంటున్నారు.
అసుదుద్దీన్, అక్బరుద్దీన్ కలిసి యూపీ మొత్తం తిరిగి బీజేపీకి మైలేజ్ తీసుకువచ్చారని అంటున్నారు. వీరు అంత ప్రచారం చేసినా ఒక్కటంటే ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయారు. కాగా బీజేపీని కావాలనే అతిగా తిట్టడం వల్ల ఎంఐఎంకు శూన్య మార్క్ డ్యామేజీ తగిలింది. ఇదంతా వ్యూహాత్మకంగానే జరిగిందంటున్నారు విశ్లేషకులు.
గతంలో పశ్చమబెంగాల్, బీహార్, మహారాష్ట్రలో కూడా ఇలాగే ఎంఐఎం పోటీ చేయగా.. అతి బీజేపీకి లాభం చేకూర్చింది. మరోసారి యూపీలో కూడా ఇదే రిపీట్ అయింది. దీన్ని బట్టి చూస్తుంటే ఎన్నికలు ఎక్కడ వచ్చినా అక్కడ కొన్ని స్థానాల్లో ఎంఐఎం పోటీ చేయడం, గెలుస్తుందన్న పార్టీ ఓట్లను చీల్చి అంతిమంగా బీజేపీకి మేలు చేయడం జరుగుతోందన్నమాట.